టాలీవుడ్ హీరో రామ్ చరణ్ షిరిడీ సాయిబాబాను దర్శించుకున్నారు. ఇవాళ షిరిడీ వెళ్లిన ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌కు అర్చకులు స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆయనను గౌరవించారు. రామ్ చరణ్‌కు సాయిబాబు ప్రతిమను బహుమానంగా అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది పెద్ది మూవీతో ప్రేక్షకులను అలరించాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం రామ్ చరణ్.. సుకుమార్ డైరెక్టర్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో ఆర్సీ17 సినిమా రానుంది. ఇటీవలే పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. రంగస్థలం తర్వాత వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా అఫీషియల్‌గా ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానుందని తెలుస్తోంది.
Mega Power Star Ram Charan visited the Shirdi Sai Baba Temple today. 🤍🙏🏻 #RamCharan https://t.co/BMtbeIxroo
— Sreekanth (@sreekanth_offI) November 13, 2026


