గత నెల చివరలో 'ఆదర్శ కుటుంబం' రిలీజైంది. వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. అయితే దీని ప్రభావం.. త్రివిక్రమ్-ఎన్టీఆర్ మూవీపై పడిందని.. ఈ ప్రాజెక్ట్ సదరు నిర్మాణ సంస్థ నుంచి చేతులు మారిందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇప్పుడు వీటిపై స్వయంగా నిర్మాణ సంస్థనే క్లారిటీ ఇచ్చేసింది.
(ఇదీ చదవండి: మౌళి 'డీఎన్‌కే' (దొంగ నా కొడుకు) రివ్యూ)
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా గాడ్ ఆఫ్ వార్ కాన్సెప్ట్‌తో ఓ చిత్రాన్ని చాలారోజుల క్రితమే ప్రకటించారు. దీనిని హారిక-హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. అయితే 'ఆదర్శ కుటుంబం' ఫ్లాప్ దెబ్బకు హారిక సంస్థతో త్రివిక్రమ్ విడిపోయారని.. మరో బడా నిర్మాణ సంస్థతో చేతులు కలిపారని.. ఎన్టీఆర్ మూవీ కూడా ఇందులో ఉంటుందని టాక్ చాలానే వినిపించింది.
అయితే ఇవన్నీ రూమర్లు మాత్రమేనని హారిక-హాసిని సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్-త్రివిక్రమ్.. నిర్మాతలు చినబాబు, కల్యాణ్ రామ్‌తో దిగిన ఫొటోని సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో పుకార్లకు చెక్ పెట్టినట్లుయింది. ప్రస్తుతం 'డ్రాగన్' షూటింగ్‌లో తారక్ బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది మొదట్లో ఇది పూర్తయిపోవచ్చు. తర్వాతే త్రివిక్రమ్ తీసే గాడ్ ఆఫ్ వార్ చిత్రీకరణ మొదలు కానుంది.
(ఇదీ చదవండి: అదో పీడకల.. దేవుడి దయ వల్ల నేను బతికాను: కాజల్ అగర్వాల్)
😎 @NTRxTrivikram https://t.co/9IGfek6Ya6
— Haarika & Hassine Creations (@haarikahassine) November 13, 2026


