కజికిస్థాన్‌లో యాక్షన్‌ | January 12 Vidudala Movie Schedule Begins in Kazakhstan | Sakshi
Sakshi News home page

కజికిస్థాన్‌లో యాక్షన్‌

Nov 6 2026 4:26 AM | Updated on Nov 6 2026 4:26 AM

January 12 Vidudala Movie Schedule Begins in Kazakhstan

కల్యాణ్‌ రామ్, అనిల్‌ రావిపూడి, వెంకటేశ్‌

వెంకటేశ్‌–కల్యాణ్‌ రామ్‌ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘జనవరి 12 విడుదల’. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనేది ట్యాగ్‌లైన్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్‌ సరసన కీర్తీ సురేష్, కల్యాణ్‌ రామ్‌ సరసన కృతీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, అర్చన సమర్పణలో సాహు గార పాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీ కొత్త షెడ్యూల్‌ని కజికిస్థాన్‌లో ప్రారంభించారు. \

ఈ సందర్భంగా వెంకటేశ్, కల్యాణ్‌ రామ్, అనిల్‌ రావిపూడి ఉన్న వర్కింగ్‌ స్టిల్‌ని విడుదల చేశారు. ‘‘ఈ  షెడ్యూల్‌లో స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ రియల్‌ సతీష్‌ పర్యవేక్షణలో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ షూట్‌లో వెంకటేశ్, కల్యాణ్‌ రామ్‌  పాల్గొన్నారు. ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ను భారీ స్థాయిలో రూపొందిస్తున్నాం.

ఇద్దరు స్టార్‌ హీరోలు ఒకే యాక్షన్‌ బ్లాక్‌లో కనిపిస్తుండటంతో  పాటు అనిల్‌ రావిపూడి ఈ సీక్వెన్స్‌ను పర్యవేక్షిస్తుండటంతో ఇది సినిమాలో ప్రధాన హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తుంది. అలాగే ఈ షెడ్యూల్‌లో వెంకటేశ్, కల్యాణ్‌ రామ్‌లపై ఓ గ్రాండ్‌ సాంగ్‌ను కూడా చిత్రీకరించనున్నాం. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement