మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్‌లో మాత్రమే సినిమాలు చేస్తోంది. ఇటీవల ఎక్కువగా ఐటమ్ సాంగ్స్‌తో అలరిస్తోంది. జైలర్ మూవీలో ఐటమ్ సాంగ్‌తో ఆకట్టుకుంది. కోలీవుడ్‌తో పాటు మలయాళంలోనూ ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇచ్చింది. 'బాంద్రా' అనే మూవీతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కానీ ఆ మూవీ పెద్దగా కలిసిరాలేదు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది.
అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ వచ్చేందుకు సిద్ధమైంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ సినిమా ఓటీటీకి రానుంది. ఈనెల 13 నుంచి జీ5 వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కాగా.. ఈ సినిమాకు రూ.35 కోట్లు బడ్జెట్ పెడితే రూ.2 కోట్ల వసూళ్లు మాత్రం వచ్చాయి. దీంతో ఓటీటీ డీల్ సైతం అలా మూలన పడిపోయింది. తాజాగా జీ5లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇక 'బాంద్రా' కథ విషయానికొస్తే.. మాఫియా డాన్ నుంచి తప్పించుకున్న ఓ హీరోయిన్.. గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడుతుంది. ఊహించని పరిస్థితుల్లో ఆమె చనిపోతుంది. తర్వాత ఏమైందనేదే స్టోరీ.
#Bandra (Malayalam) Streaming from November 13 on Zee5 🍿!! #OTT_Trackers https://t.co/PYf1buL0iD
— OTT Trackers (@OTT_Trackers) November 5, 2026


