భర్తపై అలియా భట్‌ కామెంట్స్‌.. గర్వంగా ఉందంటూ.. | Alia Bhatt Comments On Ranbir Kapoor | Sakshi
Sakshi News home page

Alia Bhatt - Ranbir Kapoor: భర్తపై అలియా భట్‌ ప్రశంసలు

Nov 5 2026 9:00 PM | Updated on Nov 5 2026 9:05 PM

Alia Bhatt Comments On Ranbir Kapoor

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా నటించిన చిత్రం ‘రామాయణం’. నేడు (నవంబర్‌ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన భార్య, నటి అలియా భట్‌ సోషల్‌ మీడియా వేదికగా రణ్‌బీర్‌ నటనపై ప్రశంసలు కురింపించారు. కుమార్తె రాహాతో  రణ్‌బీర్‌ ఉన్న ఫొటోలను అలియా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

‘ఈ సినిమా కోసం నువ్వు ఎంతో కష్టపడ్డావు. శ్రమని, సర్వస్వాన్ని ధారపోశావు. అయినప్పటికీ.. ఆమె (సీత) కోసం నీ దగ్గర ఇంకా మిగిలే ఉంది. రణ్‌బీర్‌.. నిన్ను చూసి ఎంతో గర్వంగా ఉంది. కొన్ని కథలు మనందరి కంటే గొప్పవి. అలాంటి కథల్లో రామాయణం ఒకటి’ అని అలియా పేర్కొన్నారు. కాగా రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటించిన ఈ చిత్రానికి నితేశ్‌ తివారీ దర్శకత్వం వహించారు. 

(ఇదీ చదవండి: ఆ అర్ధరాత్రి నడిరోడ్డుపై పిచ్చిదానిలా అరిచా..: కరీనా కపూర్)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement