ఆమె సాక్షాత్తు సీతమ్మే! సాయిపల్లవి లుక్‌పై ప్రశంసల వెల్లువ.. | Sai Pallavis Ramayana BTS Looks Go Viral | Sakshi
Sakshi News home page

Sai Pallavi: ఆమె సాక్షాత్తు సీతమ్మే! సాయిపల్లవి లుక్‌పై ప్రశంసల వెల్లువ..

Nov 5 2026 6:02 PM | Updated on Nov 5 2026 6:05 PM

Sai Pallavis Ramayana BTS Looks Go Viral

భారీ అంచనాల నడుమ ఎట్టకేలకు  ఈ రోజు 'రామాయణ' సినిమా థియేటర్లలో విడుదలైంది. నిర్మాత నమిత్‌ మల్హోత్రా, దర్శకుడు నితేశ్‌ తివారీ ఆధ్వర్యంలో తెరకెక్కిన రామాయణం మూవీ విమర్శకులు, అభిమానుల ప్రశంసలు అందుకుంది. దీనిపై పలువురు ప్రముఖుల, సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్టులు కూడా పెట్టారు. 

ఈ నేపథ్యంలో ఆ మూవీలోని సాయిపల్లవి ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వాటిని చూసి అభిమానుల..నిజంగా సీతమ్మే భువిపైకి వచ్చిందా అనేలా ఉంది అంటూ నటి సాయిపల్లవి సహజ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఎటు చూసినా.. ఈ మూవీనే హాట్‌టాపిక్‌గా మారింది. ఆ సినిమాలో ఆమె ప్రతి సన్నివేశంలో సీతమ్మలా ఒదిగిపోయింది. కేవలం నటన పరంగానే కాదు లుక్‌ పరంగా కూడా సాయిపల్లవి విమర్శకుల ప్రశంసలందుకోవడం విశేషం. అంతేగాదు అందరూ ఆమెను రియల్‌ సీతమ్మ అని ముక్కకంఠంతో కీర్తించారు. 

వనవాసం ఘట్టంలో నార చీరలు ధరించినప్పుడూ..రాక్షసులతో వీరనారిలా యుద్ధ చేసినప్పుడూ..ఆమె ఆహార్యం అద్భుతంగా ఉంది. అలాగే సీతారాముల కళ్యాణ ఘట్టంలో ఆమె లుక్‌, ధరించిన చీర, నగలు..అన్నీ ఆ దివి నుంచి భువికి వచ్చిన సీతమ్మను తలపించేలా కనిపించింది సాయిపల్లవి. ఆ వివాహ ఘట్టంలో సాయిపల్లవి ధరంచిన ఎరుపురంగు చీర, ఆభరణాలతో కలిపి సుమారు 22 కిలోలు బరువుని ఒంటిపై మోసిందట. 

ఆమె ప్రతి సన్నివేశంలోనూ సీతగా చాలా నేచురల్‌గా కనపించిందంటూ సాయిపల్లవిపై పొగడ్తల జల్లు కురిపించారు. కాగా, ఈ మూవీలో సీతమ్మ యుద్ధం చేసినట్లు చూపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే మన పురాణాల ప్రకారం..శ్రీరాముడు ఒక్కడే ఖర, దూషణుల 1400ల మంది రాక్షస సైన్యంపై పోరాటం చేసినట్లు ఉంది. దాంతో ఇది కాస్త వివాదాస్పదంగా మారింది. ఇక రావణుడిగా యశ్‌, హనుమంతుడిగా సన్నిడియోల్‌ ప్రేక్షకులను మెప్పించారు. 

 

ఇదీ చదవండి: భారత వధువరులుగా ఇటలీ ప్రేమికులు..వేదమంత్రాల సాక్షిగా ముడిపడిన బంధం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement