Harika and Hasini Creations
-
బిగ్ ప్లాన్‌తో రవితేజ కూతురు 'మోక్షద' .. ఎంట్రీకి లైన్ క్లియర్
చిత్ర పరిశ్రమలో ఇప్పటికే చాలామంది స్టార్ హీరోల వారసులు రాణిస్తున్నారు. కొందరు నటీనటులుగా మెప్పిస్తే.. మరికొందరు నిర్మాణ బాధ్యతల్లో ఉన్నారు. అయితే, ఇప్పుడు మాస్‌మహారాజ్ రవితేజ( Ravi Teja) ముద్దుల కూతురు మోక్షద(Mokshadha) ఎంట్రీకి లైన్ క్లియర్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇదే విషయం గురించి కొద్దిరోజుల క్రితమే సోషల్‌మీడియాలో ఒక వార్త వైరల్ అయింది. ఆమె హీరోయిన్గా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆమె తెరమీద నటించేందుకు రావడం లేదని, తెర వెనుక కీలకంగా పోషించే పాత్రలో ఉండనున్నారని వారి సన్నిహితులు చెబుతున్న మాట.సినీ నేపథ్యం లేకుండా వచ్చి టాలీవుడ్లో స్టార్ హీరో అయ్యాడు రవితేజ. ఇతడికి కొడుకు మహాధన్, కూతురు మోక్షద ఉన్నారు. కొడుకు ఇదివరకే 'రాజా ది గ్రేట్' మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. ప్రస్తుతం ఓ దర్శకుడి దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ కూతురు ఇప్పుడు నిర్మాణ బాధ్యతలు నేర్చుకుంటోందని ఇండస్ట్రీలోని కొందరు చెబుతున్నారు. వినోద్ అనంతోజు దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండతో(Anand Deverakonda) ఒక సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్(Sithara Entertainments) ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాకు రవితేజ కూతురు మోక్షద ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తోందట. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు ఇంకా టైటిల్ ఫైనల్ చేయలేదు. ఒక ప్రత్యేకమైన కథాంశంతో కూడిన యాక్షన్-థ్రిల్లర్‌గా ఈ చిత్రం రానుంది. మొదట అందరూ మోక్షద గురించి మాట్లాడుతూ.. హీరోయిన్ లేదా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తుందనుకున్నారు. కానీ, ఆమె నిర్మాతగా భవిష్యత్‌లో కనిపించే ఛాన్స్ ఎక్కువ ఉంది.నిర్మాతలుగా సత్తా చాటుతున్న హీరోల కూమార్తెలుసితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య మ్యాడ్ వంటి చిత్రాలను నిర్మించి రాణిస్తున్నారు. కమిటీ కుర్రోళ్ళు వంటి సినిమాతో నిర్మాతగా నిహారిక కొణిదెల సత్తా చాటింది. సుస్మిత కొణిదెల నిర్మాతగా చిరంజీవి- అనిల్ రావిపూడితో ఒక సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఆపై బాలకృష్ణ- బోయపాటి శ్రీను కొత్త సినిమా BB4కు నందమూరి తేజస్విని నిర్మాతగా ఉన్నారు. రాబోయే రోజుల్లో వీరందరి సరసన రవితేజ ముద్దులు కూతురు మోక్షిద కూడా చేరనుంది. -
అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటి వరకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా మాటల మాంత్రిక్రుడు త్రివిక్రమ్ కాంబోలో భారీ పాన్ ఇండియా చిత్రం రానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. చాలా రోజుల నుంచి వీరిద్దరి కాంబోలో నాలుగో చిత్రం రానుందని ప్రచారం జరిగింది. (ఇదీ చదవండి: ఆమెకు దూరంగా ఉండాలంటూ సోనూసూద్‌కు సలహాలిస్తున్న ఫ్యాన్స్) దీనిని నిజం చేస్తూ తాజాగా గీతా ఆర్ట్స్ , హారికా- హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా అల్లు అర్జున్- త్రివిక్రమ్‌లతో సినిమా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. నిర్మాత నాగవంశీ కూడా ఈ సినిమాకు సంబంధించి ట్వీట్ చేశారు. నేడు (జులై 3)న ఉదయం 10 గంటల 8 ని.లకు వీడియో ద్వారా వారు మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న బన్నీకి ఈ సినిమా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా ఉంటుందని సమాచారం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది. We are elated to reunite the much celebrated duo. It's the Icon Star @alluarjun garu & our Darling Director #Trivikram garu coming together for the 4th time 🤩🌟 More Details Soon 🖤 #AlluAravind #SRadhaKrishna @haarikahassine @geethaarts pic.twitter.com/xO7P05IBgY — Naga Vamsi (@vamsi84) July 3, 2023 -
మహేశ్ బాబు SSMB28 లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది..
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇదే విషయంపై మూవీ టీం సైతం క్లారిటీ ఇచ్చింది. జనవరిలో ‘ఎస్ఎస్ఎంబీ28’(SSMB28) రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక మూవీ టీంతో కలిసి మహేశ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. All set to shoot! With heightened spirit and great energy #SSMB28 will go on sets from January, non-stop! Stay-Tuned, More SUPER-EXCITING updates coming your way soon! 🌟✨ SUPERSTAR @urstrulyMahesh #Trivikram @hegdepooja @MusicThaman #PSVinod #ASPrakash @NavinNooli @vamsi84 pic.twitter.com/cEjRFVsz64 — Haarika & Hassine Creations (@haarikahassine) December 10, 2022 -
అయోధ్యలో అర్జునుడు?
‘అతడు’(2005), ‘ఖలేజా’ (2010) చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై చినబాబు (ఎస్.రాధాకృష్ణ) నిర్మిస్తున్న ఈ మూవీ తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. దసరా తర్వాత ప్రారంభమయ్యే మలి షెడ్యూల్లో మహేశ్, పూజలపై సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ సినిమా టైటిల్‌గా గతంలో ‘పార్థు’, ‘అర్జునుడు’ అనే పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్‌ను యూనిట్ పరిశీలిస్తోందని టాక్. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గత నాలుగు చిత్రాలు (అఆ, అజ్ఞాత వాసి, అరవిందసమేత వీర రాఘవ, అల..వైకుంఠపురములో..) టైటిల్స్ ‘అ’ అక్షరంతోనే మొదలయ్యాయి. దీంతో మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లోని తాజా చిత్రం టైటిల్ కూడా ‘అ’ తోనే మొదలవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. -
దిల్ ఖుష్... ఫుల్ జోష్
‘అతడు’ (2005), ‘ఖలేజా’ (2010) చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ముచ్చటగా మూడో చిత్రం రూపొందనుంది. ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్నారు. శనివారం ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ దిల్ ఖుష్‌తో... ఫుల్ జోష్‌లో ఉన్నారు. సూపర్‌స్టార్ కృష్ణ, మహేశ్‌బాబు తండ్రి బర్త్ డే (మే 31) సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. -
‘అల వైకుంఠపురంలో’ ఈవెంట్‌పై క్రిమినల్ కేసు
సాక్షి, హైదరాబాద్: అనుమతులకు విరుద్ధంగా గడువు ముగిసిన తరువాత కూడా కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న కారణంగా శ్రేయాస్ మీడియా ఎండీ శ్రీనివాస్‌తో పాటు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మేనేజర్ యగ్నేష్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 6న సాయంత్రం యూసుఫ్ గూడ బెటాలియన్ పోలీస్ గ్రౌండ్స్‌లో ‘అల వైకుంఠపురంలో’ సినిమా మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు. కార్యక్రమానికి సినిమా హీరో, హీరోయిన్లు అల్లు అర్జున్, పూజాహెగ్డేతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, చిన్నబాబు హాజరయ్యారు. కాగా ఇందుకు సంబందించి ఈ నెల 2న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మేనేజర్ కె.యగ్నేష్ పోలీసుల అనుమతి తీసుకున్నారు. వేడుకలకు దాదాపు 5 నుంచి 6వేల మంది హాజరవుతారని రాత్రి 10 గంటల వరకు కార్యక్రమం ముగుస్తుందని అతను పోలీసులకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నాడు. శ్రేయాస్ మీడియా నిర్వహించిన ఈ కార్యక్రమం 11.30 గంటల వరకు కొనసాగింది. గంటన్నర అదనంగా కార్యక్రమాన్ని కొనసాగించడమే కాకుండా పోలీసులకు ఇచ్చిన దరఖాస్తులో ఆరువేల మందికి మాత్రమే పాస్‌లు ఇచ్చామని చెప్పిన నిర్వాహకులు దాదాపు 15వేల మందిని ఆహ్వానించినట్లుగా గుర్తించారు. ఈ కారణంగా వేడుకలో తొక్కిసలాట జరగడమేగాక వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో యూసుఫ్‌గూడ రహదారులు కిక్కిరిశాయి. పోలీసులు వీరిని నియంత్రించలేకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యక్రమ నిర్వాహకుల నిర్లక్ష్యం తీవ్ర అసౌకర్యానికి, ఉద్రిక్తతకు దారితీసిందని తొక్కిసలాట జరిగిందని ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ జూబ్లీహిల్స్ ఎస్ఐ నవీన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రేయాస్ మీడియా ఎండీ శ్రీనివాస్‌తో పాటు యగ్నేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: అల్లు అర్జున్ భావోద్వేగం) -
త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ ఎవరంటే..
సాక్షి, సినిమా : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నట్లు ప్రచారం ఉన్నా అధికారికంగా ప్రకటించలేదు. అయితే పూజానే ఎన్టీఆర్ సరసన నటిస్తోందని చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. దంతోపాటు ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించనున్నారని, పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫి చెయనున్నట్లు ట్వీట్ చేసింది. ఏప్రెల్ నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపింది. దీనికి పూజా ఇటువంటి టీంతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని స్పందించారు. ఎన్టీఆర్ సరికొత్తగా కనిపించనున్న ఈ సినిమాకు అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఇప్పటికే సినిమా ట్యాగ్ లైన్‌గా ‘ఆన్ సైలెంట్ మోడ్’ నే క్యాప్షన్‌ను ఫిక్స్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. 2019 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. It is our absolute pleasure to welcome aboard @hegdepooja as female lead opposite our young tiger #NTR @tarak9999.@MusicThaman will be scoring scintillating tunes for #PSVinod 's meticulous visuals. Shoot will commence from april, 2018. — Haarika & Hassine Creations (@haarikahassine) March 5, 2018 -
ఎన్టీఆర్ ‘ఆన్ సైలెంట్ మోడ్’
జై లవ కుశ సినిమాతో ఘనవిజయం అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ లో దర్శనమివ్వనున్నాడట. అందుకోసం విదేశీ ట్రైనర్ పర్యవేక్షణలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సరికొత్తగా కనిపించనున్న ఈ సినిమాకు అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. అంతేకాదు ట్యాగ్ లైన్‌గా ‘ఆన్ సైలెంట్ మోడ్’ నే క్యాప్షన్‌ను ఇప్పటికే ఫిక్స్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. 2019 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
అజ్ఞాతవాసికి మరిన్ని కష్టాలు..
సాక్షి, సినిమా : పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్ర కథ ‘కాపీ వివాదం’ మరో మలుపు తీసుకుంది. చిత్ర నిర్మాతలపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు మాతృక చిత్రం లార్గో వించ్(ఫ్రెంచ్) దర్శకుడు జెరోమ్ సల్లే సిద్ధమైపోయారు. ఈ మేరకు తన ట్విటర్లో ఆయన సంకేతాలు అందించారు. ‘‘వారం గడిచినా అజ్ఞాతవాసి చిత్ర యూనిట్ మౌనంగా ఉండటం బాగోలేదు. ఇక చర్యలు తీసుకునే సమయం వచ్చింది. మిగిలింది లీగల్ నోటీసులు పంపటం ’’ అంటూ ఆయన పేర్కొన్నారు. ఫ్రెంచ్ మూవీ 'లార్గో వించ్' చిత్రానికి అజ్ఞాతవాసి కాపీ అనే ప్రచారం జరిగిన సమయంలో... ఇండియాలో రీమేక్ హక్కులను దక్కించుకున్న 'టి సిరీస్' సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. 'అజ్ఞాతవాసి' చిత్ర దర్శక నిర్మాతలకు నోటీసులు పంపటంతో.. చివరకు టీ సిరీస్ తో సెటిల్ చేసుకుంటున్నారన్న వార్తలు వినిపించాయి. ఆ వెంటనే తెర పైకి వచ్చిన లార్గొ వించే దర్శకుడు జెరోమ్ సల్లే చిత్రాన్ని వీక్షించేందుకు ఆసక్తికనబరిచారు. ఈ క్రమంలో త్రివిక్రమ్ తన కథనాన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా దించేశాడని సినిమా చూశాక సల్లే వ్యాఖ్యానించటం విశేషం. కొద్దిరోజుల క్రితం ఆయన మరో ట్వీట్ చేశారు. ‘‘సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది, కేవలం టీ సిరీస్ తో సెటిల్ చేసుకుంటే సరిపోదేమో?’’ అంటూ మరో ట్వీట్ చేసి చర్యలకు సిద్ధమౌతున్నట్లు సంకేతాలు అందించారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ నుంచి స్పందన లేకపోవటంతో ఆయన లీగల్ నోటీసులకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. నెగటివ్ టాక్‌తో ఇప్పటికే ఈ చిత్రానికి భారీ డ్యామేజ్ కాగా, ఇప్పుడు న్యాయపరమైన చిక్కులతో మరో దెబ్బ తగలబోతోంది. Indian cinema has all the necessary talent and creativity for not having to plagiarize. And the silence from #Agnathavaasi team since one week is deafening. So let’s take action now. #LegalNotice — Jérôme Salle (@Jerome_Salle) 18 January 2018 Mood #LargoWinch #Agnathavasi pic.twitter.com/w2uLnwo9kD — Jérôme Salle (@Jerome_Salle) 17 January 2018 -
వెంకీతో త్రివిక్రమ్ రీమేక్
ఫ్యామిలీ హీరో వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందిస్తున్నట్టుగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ జాలీ ఎల్ఎల్బి 2 చిత్రానికి రీమేక్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవలే జాలీ ఎల్ఎల్బి 2 నిర్మాతలను రాధాకృష్ణ కలిసి చిత్ర హక్కులను తీసుకున్నారట. అయితే అది వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమానే అని అధికారికంగా ప్రకటించలేదు. రీమేక్ సినిమాలు చేయటంలో వెంకటేష్ కు తిరుగులేని రికార్డ్ ఉంది. ఆయన కెరీర్ లో అత్యధిక విజయాలు రీమేక్స్ రూపంలోనే వచ్చాయి. రీసెంట్గా గురు సినిమా కూడా రీమేక్ గా తెరకెక్కి విజయం సాధించింది. అయితే త్రివిక్రమ్ ఇంతవరకు ఏ సినిమాను రీమేక్ చేయలేదు. అయితే ఈ సినిమా ఓకే అయితే మొదటిసారిగా త్రివిక్రమ్ రీమేక్ చేసే సినిమా ఇదే అవుతుంది. వీరిద్దరి కాంబినేషన్ అనగానే మనకు గుర్తొచ్చే సినిమా నువ్వు నాకు నచ్చావ్. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశాడు. అందులో తన మార్క్ డైలాగ్‌లతో, కామెడీతో తన ముద్ర వేశాడు. ఇప్పుడు కూడా అలాంటి ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకుల ముందుకు రావొచ్చని అభిమానులు భావిస్తున్నారు. -
‘అజ్ఞాతవాసి’ వచ్చేశాడు..
సాక్షి, హైదరాబాద్ : అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా టీజర్ వచ్చేసింది. పెద్దగా మాటల్లేని టీజర్.. మెలోడియస్ మ్యూజిక్‌తో ఆకట్టుకుంది. టీజర్లో చక్కని లుక్స్‌తో కనిపించిన పవన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తున్నారు. మధురా.. అని ప్రారంభమయ్యే పాట టీజర్ మొత్తం సాగుతుంది. చివర్లో పవన్.. ‘ఓ మై గాడ్’ అనే ఒక్కమాట మాత్రమే టీజర్లో ఉంది. కీర్తి సురేష్ పవన్ బుగ్గలు లాగే సన్నివేశం చిలిపిగా ఉంది. కాగా, అజ్ఞాతవాసి ఆడియో ఈ నెల 19వ తేదీన విడుదల కానుంది. ‘అజ్ఞాతవాసి’లో కీర్తి సురేశ్‌తోపాటు అను ఇమ్మాన్యుయేల్ మరో కథానాయికగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్ బాణీలు అందిస్తున్నారు. జనవరి 10న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ బ్లాక్‌బస్టర్స్ తర్వాత పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. -
‘అజ్ఞాతవాసి’ వచ్చేశాడు..
-
అక్షయ్ సూపర్ హిట్‌పై టాలీవుడ్ కన్ను
యాక్షన్ హీరోగా సత్తా చాటి ప్రస్తుతం కామెడీ స్టార్‌గా ఆకట్టుకుంటున్న బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఇటీవల ప్రయోగాత్మక చిత్రాలతో వరుస సక్సెస్‌లు సాధిస్తున్న ఈ కిలాడీ 2.0 సినిమాతో విలన్ గానూ అలరించనున్నాడు. అక్షయ్ హీరోగా ఇటీవల బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన జాలీ ఎల్.ఎల్.బి 2 సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. టాలీవుడ్ నిర్మాత ఎస్ రాధకృష్ణ ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఓ స్టార్ హీరోతో జాలీ ఎల్ ఎల్ బి సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు. బాలీవుడ్లో వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈ రీమేక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నితిన్ నోట త్రివిక్రమ్ మాట!
త్రివిక్రమ్ మాటల తూటాలు ఏ హీరో నోటి నుంచి పేలినా అవి ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తాయి. అది ఆయన డైలాగ్స్కున్న పవర్. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత ఆయన తెరకెక్కించనున్న సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఆయన తాజా చిత్రానికి సంబంధించిన కబురు రానే వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్‌తో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలను రూపొందించిన సూర్యదేవర రాధాకృష ్ణ(చిన బాబు) ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో నితిన్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. ఓ కథానాయికగా స్టార్ హీరోయిన్ సమంత నటించనుండగా, ఇంకో కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ- ‘‘సెప్టెంబరు మూడో వారంలో షూటింగ్ ప్రారంభించి, సంక్రాంతి కానుకగా విడుదల చేస్తాం. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్, కెమెరా: నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పి.డి.వి.ప్రసాద్, సమర్పణ: శ్రీమతి మమత.