వెంకీతో త్రివిక్రమ్ రీమేక్ | Trivikram, Venkatesh Movie Jolly LLB 2 remake | Sakshi
Sakshi News home page

Jan 4 2018 4:39 PM | Updated on Jan 4 2018 4:39 PM

Trivikram, Venkatesh Movie Jolly LLB 2 remake - Sakshi

ఫ్యామిలీ హీరో వెంకటేష్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందిస్తున్నట్టుగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సినిమా బాలీవుడ్‌ సూపర్‌ హిట్ జాలీ ఎల్‌ఎల్‌బి 2 చిత్రానికి రీమేక్‌ అన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవలే జాలీ ఎల్‌ఎల్‌బి 2 నిర్మాతలను రాధాకృష్ణ కలిసి చిత్ర హక్కులను తీసుకున్నారట. అయితే అది వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమానే అని అధికారికంగా ప్రకటించలేదు. 

రీమేక్ సినిమాలు చేయటంలో వెంకటేష్ కు తిరుగులేని రికార్డ్ ఉంది. ఆయన కెరీర్ లో అత్యధిక విజయాలు రీమేక్స్ రూపంలోనే వచ్చాయి. రీసెంట్‌గా గురు సినిమా కూడా రీమేక్ గా తెరకెక్కి విజయం సాధించింది. అయితే త్రివిక్రమ్‌ ఇంతవరకు ఏ సినిమాను రీమేక్‌ చేయలేదు. అయితే  ఈ సినిమా ఓకే అయితే మొదటిసారిగా త్రివిక్రమ్‌ రీమేక్‌ చేసే సినిమా ఇదే అవుతుంది.

వీరిద్దరి కాంబినేషన్‌ అనగానే మనకు గుర్తొచ్చే సినిమా నువ్వు నాకు నచ్చావ్‌. విజయ్ భాస్కర్ దర‍్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశాడు. అందులో తన మార్క్‌ డైలాగ్‌లతో, కామెడీతో తన ముద్ర వేశాడు. ఇప్పుడు కూడా అలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రావొచ్చని అభిమానులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement