‘అజ్ఞాతవాసి’ వచ్చేశాడు.. | Agnathavasi Teaser Released | Sakshi
Sakshi News home page

‘అజ్ఞాతవాసి’ వచ్చేశాడు..

Dec 16 2017 6:52 PM | Updated on Mar 22 2019 5:33 PM

Agnathavasi Teaser Released - Sakshi

సాక్షి, హైదరాబాద్ : అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన పవన్‌ కళ్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ సినిమా టీజర్‌ వచ్చేసింది. పెద్దగా మాటల్లేని టీజర్‌.. మెలోడియస్‌ మ్యూజిక్‌తో ఆకట్టుకుంది. టీజర్‌లో చక్కని లుక్స్‌తో కనిపించిన పవన్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తున్నారు. మధురా.. అని ప్రారంభమయ్యే పాట టీజర్‌ మొత్తం సాగుతుంది. చివర్లో పవన్‌.. ‘ఓ మై గాడ్‌’ అనే ఒక్కమాట మాత్రమే టీజర్‌లో ఉంది. కీర్తి సురేష్‌ పవన్‌ బుగ్గలు లాగే సన్నివేశం చిలిపిగా ఉంది. కాగా, అజ్ఞాతవాసి ఆడియో ఈ నెల 19వ తేదీన విడుదల కానుంది. 

‘అజ్ఞాతవాసి’లో కీర్తి సురేశ్‌తోపాటు అను ఇమ్మాన్యుయేల్‌ మరో కథానాయికగా నటిస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్‌ బాణీలు అందిస్తున్నారు. జనవరి 10న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ బ్లాక్‌బస్టర్స్‌ తర్వాత పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది.

Advertisement
 
Advertisement
Advertisement