త్రివిక్రమ్‌-ఎన్టీఆర్‌ సినిమాలో హీరోయిన్‌ ఎవరంటే.. | Pooja Hegde act with NTR in Trivikram movie | Sakshi
Sakshi News home page

త్రివిక్రమ్‌-ఎన్టీఆర్‌ సినిమాలో హీరోయిన్‌ ఎవరంటే..

Mar 5 2018 3:17 PM | Updated on Mar 5 2018 3:23 PM

Pooja Hegde act with NTR in Trivikram movie - Sakshi

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఎన్టీఆర్‌

సాక్షి, సినిమా : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రచారం ఉన్నా అధికారికంగా ప్రకటించలేదు.  అయితే పూజానే ఎన్టీఆర్‌ సరసన నటిస్తోందని చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. దంతోపాటు ఈ సినిమాకి ఎస్‌ఎస్ తమన్‌ సంగీతాన్ని అందించనున్నారని, పీఎస్‌ వినోద్‌ సినిమాటోగ్రఫి చెయనున్నట్లు ట్వీట్ చేసింది. ఏప్రెల్‌ నుంచి సినిమా షూటింగ్‌ ప్రారంభం అవుతుందని తెలిపింది. 

దీనికి పూజా ఇటువంటి టీంతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని స్పందించారు. ఎన్టీఆర్ సరికొత్తగా కనిపించనున్న ఈ సినిమాకు అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఇప్పటికే సినిమా ట్యాగ్ లైన్‌గా ‘ఆన్‌ సైలెంట్‌ మోడ్‌’ నే క్యాప్షన్‌ను ఫిక్స్‌ చేశారన్న ప్రచారం జరుగుతోంది. 2019 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement