అక్షయ్ సూపర్ హిట్పై టాలీవుడ్ కన్ను | Jolly LLb 2 Tollywood Remake | Sakshi
Sakshi News home page

అక్షయ్ సూపర్ హిట్పై టాలీవుడ్ కన్ను

May 6 2017 4:27 PM | Updated on Sep 5 2017 10:34 AM

అక్షయ్ సూపర్ హిట్పై టాలీవుడ్ కన్ను

అక్షయ్ సూపర్ హిట్పై టాలీవుడ్ కన్ను

యాక్షన్ హీరోగా సత్తా చాటి ప్రస్తుతం కామెడీ స్టార్గా ఆకట్టుకుంటున్న బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఇటీవల ప్రయోగాత్మక

యాక్షన్ హీరోగా సత్తా చాటి ప్రస్తుతం కామెడీ స్టార్గా ఆకట్టుకుంటున్న బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఇటీవల ప్రయోగాత్మక చిత్రాలతో వరుస సక్సెస్లు సాధిస్తున్న ఈ కిలాడీ 2.0 సినిమాతో విలన్ గానూ అలరించనున్నాడు. అక్షయ్ హీరోగా ఇటీవల బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన జాలీ ఎల్.ఎల్.బి 2 సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

టాలీవుడ్ నిర్మాత ఎస్ రాధకృష్ణ ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఓ స్టార్ హీరోతో జాలీ ఎల్ ఎల్ బి సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు. బాలీవుడ్లో వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈ రీమేక్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement