యాక్షన్ థ్రిల్లర్‌ | Akshay Kumar begins shooting for Samuk Movie | Sakshi
Sakshi News home page

యాక్షన్ థ్రిల్లర్‌

Aug 25 2026 3:11 AM | Updated on Aug 25 2026 3:11 AM

Akshay Kumar begins shooting for Samuk Movie

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న కొత్త సినిమాకు ‘సముక్‌’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు మేకర్స్‌. సర్వైవల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి కనిష్క్‌ వర్మ దర్శకుడు. విపుల్‌ అమృత్‌లాల్‌ షా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ సోమవారం లండన్‌లో ప్రారంభమైంది. ‘‘సముక్‌’ సినిమా చిత్రీకరణ మొదలైంది. కొత్త జానర్‌లో కొత్త సవాల్‌ను స్వీకరించాను. 

వివాన్‌ అహుజాగా డ్యూటీ మొదలుపెట్టాను’’ అని ‘ఎక్స్‌’లో పేర్కొంటూ వీడియోను షేర్‌ చేశారు అక్షయ్‌ కుమార్‌. కాగా, ఈ సినిమా మేజర్‌ షూటింగ్‌ లండన్ లో జరుగుతుందని, కొద్దిపాటి షూటింగ్‌ ముంబైలో జరుగుతుందని బాలీవుడ్‌ సమాచారం. అంతర్జాతీయ సంబంధాలు, సర్వైవల్‌ హారర్, గ్రహాంతరవాసులు వంటి అంశాల నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్‌ సమాచారం. హాలీవుడ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ నిపుణుడు అలెక్‌ గిల్లిస్, స్టంట్‌ డైరెక్టర్‌ ల్యూక్‌ టంబర్‌ వంటి సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వర్క్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement