ధనుష్‌ మూవీకి కొత్త చిక్కులు.. టైటిల్‌లో మార్పు | Dhanush om movie title change | Sakshi
Sakshi News home page

ధనుష్‌ మూవీకి కొత్త చిక్కులు.. టైటిల్‌లో మార్పు

Nov 13 2026 9:21 PM | Updated on Nov 13 2026 9:22 PM

Dhanush om movie title change

తమిళ స్టార్ హీరో ధనుష్‌, మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ చిత్రం ‘ఓం’. ఈ చిత్రం నవంబర్ 20న  విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. 

సినిమా టైటిల్‌పై సెన్సార్ బోర్డ్‌ అభ్యాంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు ‘OM’(ఓం) పేరుతో ప్రచారం చేసిన ఈ సినిమా టైటిల్‌ను ఇప్పుడు ‘O.M’( ఓ.o) గా మార్చారు. ఈ మేరకు కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం.

కాగా ఈ చిత్రంలో సాయిపల్లవి పోలీస్‌ అధికారిగా కనిపించనుంది. శ్రీలీల, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా.. వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై ధనుష్‌, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జగ్మగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

(ఇదీ చదవండి: బాలకృష్ణ ‘దాదా’ నుంచి క్రేజీ సాంగ్‌ రిలీజ్‌ )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement