
తెలుగులో చాలా సినిమాల్లో హీరోయిన్‌గా మెప్పించిన బ్యూటీ లయ. భద్రం కొడుకో మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టిన లయ.. ఆ తర్వాత స్వయంవరం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా మెప్పించింది. అయితే పెళ్లి తర్వాత యూఎస్ వెళ్లిపోయిన లయ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జాబ్ కూడా చేసింది. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తోంది.
నితిన్ హీరోగా వస్తోన్న తమ్ముడు చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రిలీజ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు హాజరైన లయ.. తమ్ముడు సినిమా గురించి తన అనుభవాలు పంచుకుంది. నా రియల్ లైఫ్‌లో అక్కా, తమ్ముడు అంటూ తనకెవ్వరు లేరని తెలిపింది. అందుకే ఈ చిత్రం తన కెరీర్‌లో చాలా స్పెషల్ అని ఆనందం వ్యక్తం చేసింది. ఈ మూవీ కోసం దాదాపు 90 రోజుల పాటు చెప్పుల్లేకుండానే పని చేశానని లయ వెల్లడించింది.
లయ మాట్లాడుతూ..' ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్‌కు నేను ఎప్పుడు ఫీలవ్వలేదు. ఎందుకంటే నాకు అక్కా, తమ్ముడు, చెల్లి లాంటి వాళ్లు ఎవరూ లేరు. నా సినిమా జర్నీలో ఇది ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్. సినిమా మొత్తం చెప్పుల్లేకుండా పరిగెత్తడం చాలా ఈజీ అనుకున్నా. కానీ తర్వాత రోజు అలానే చేస్తుంటే ఆ నొప్పి అప్పుడు అర్థమైంది. దెబ్బ మీద దెబ్బ తగిలి అలానే అలవాటు చేసుకున్నా. ఇన్నాళ్లు నా పాత సినిమాలు చూసి ఎలా అభిమానించారో.. నా తమ్ముడు సినిమాకు కూడా అలాగే మద్దతిస్తారని ఆశిస్తున్నా' అని తన అనుభవాన్ని పంచుకుంది.
కాగా.. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నితిన్ అక్కగా ఝాన్సీ కిరణ్మయి పాత్రలో నటించింది.