బెల్లంకొండ 'భైరవం'.. శివరాత్రికి 'తమ్ముడు' | Bellamkonda Srinivas Bhairavam Movie First Look | Sakshi
Sakshi News home page

కొత్త అప్‌డేట్స్‌తో వచ్చేసిన నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్

Nov 4 2024 4:39 PM | Updated on Nov 4 2024 4:48 PM

Bellamkonda Srinivas Bhairavam Movie First Look

*'ఛత్రపతి' రీమేక్ ఫలితం దెబ్బకు సైలెంట్ అయిపోయిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. కొత్త సినిమాని రెడీ చేశాడు. 'భైరవం' టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ కూడా తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఏడాది తమిళంలో వచ్చిన 'గరుడన్' చిత్రానికి ఇది రీమేక్ అని తెలుస్తోంది. మంచు మనోజ్, నారా రోహిత్ కూడా ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకుడు. వచ్చే నెలలో అంటే డిసెంబరు 3వ వారంలో రిలీజ్ ఉండొచ్చని టాక్.

(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న నటి సన్నీ లియోన్!)

*ప్రస్తుతం 'రాబిన్ హుడ్' చేస్తున్న నితిన్.. డిసెంబరు 20న ఈ సినిమాతో థియేటర్లలోకి రానున్నాడు. మరోవైపు 'వకీల్ సాబ్' తీసిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'తమ్ముడు' చేస్తున్నాడు. బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్ కథతో తీస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది శివరాత్రికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు.

*అనుష్క శెట్టి ప్రస్తుతం 'ఘాటి' అనే సినిమా చేస్తోంది. క్రిష్ దర్శకుడు. చాలా వరకు షూటింగ్ పూర్తి కాగా.. ఈనెల 7న అంటే గురువారం చిత్ర గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇది వచ్చిన తర్వాత మూవీ ఎలా ఉండబోతుందని ఓ అంచనాకు రావొచ్చు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)

Advertisement
 
Advertisement
Advertisement