ఏంటి మీ గోల?.. డౌట్స్ ఉంటే ట్రైలర్ చూడండి..! | Nithiin Latest Movie Thammudu Trailer Date announcement | Sakshi
Sakshi News home page

Nithiin: ఏంటి తమ్ముడు ఈ గోల?.. హీరోయిన్లతో ట్రైలర్ డేట్‌ అనౌన్స్‌మెంట్!

Jun 9 2025 3:39 PM | Updated on Jun 9 2025 3:39 PM

Nithiin Latest Movie Thammudu Trailer Date announcement

ఇటీవల టాలీవుడ్‌ మూవీ ప్రమోషన్లలో డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నారు. అందరికంటే కాస్తా భిన్నంగా చేస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. తాజాగా నితిన్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'తమ్ముడు' మేకర్స్ అదే అలానే ట్రై చేశారు. గతంలో మూవీ రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేసేందుకు కొత్తగా ట్రై చేశారు. తాజాగా ట్రైలర్‌ అపేడేట్‌ ఇ‍చ్చేందుకు మరోసారి అదే స్టైల్‌నే ఫాలో అయ్యారు. హీరోయిన్లు హడావుడి చేస్తూ ట్రైలర్‌ డేట్‌ ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఆ వీడియోలో 'నేను అడగడం వల్లే ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. ఇప్పుడు ట్రైలర్‌ విషయంలోనూ అంతే' అంటూ వర్ష బొల్లమ్మ ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించింది. అయితే మేము చెప్తాం అంటూ అక్కడే ఉన్న హీరోయిన్‌ సప్తమీ గౌడ, స్వాసిక చెబుతారు. ఈ మాట విన్న లయ అసలు మీరిద్దరు ఎవరు? అని ప్రశ్నిస్తుంది. వేరే సినిమాలో నటించి.. తమ్ముడు అనుకున్నారా? అంటూ వర్ష బొల్లమ్మ నవ్వులు పూయిస్తుంది. చివర్లో డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చి.. ఏంటి మీ గోల? మీ డౌట్స్ క్లారిఫై అవ్వాలంటే ట్రైలర్ చూడండి అని అనడంతో వీడియో ముగుస్తుంది.

టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటిస్తోన్న తమ్ముడు ట్రైలర్‌ను జూన్ 11న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ సినిమాలో సప్తమి గౌడ, లయ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ మూవీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సౌరభ్ సచ్‌దేవా, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement