'మాట పోయి మనిషి బతికినా.. పోయినట్టే లెక్క'.. ఆసక్తిగా తమ్ముడు ట్రైలర్ | Tollywood Hero Nithiin Thammudu Movie Trailer Out Now | Sakshi
Sakshi News home page

Thammudu Movie Trailer: 'మాట పోయి మనిషి బతికినా.. పోయినట్టే లెక్క'.. ఆసక్తిగా తమ్ముడు ట్రైలర్

Jun 11 2025 5:22 PM | Updated on Jun 11 2025 5:29 PM

Tollywood Hero Nithiin Thammudu Movie Trailer Out Now

టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ  హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ద్వారా లయ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు.

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. బ్యాంగర్‌ ఫ్రమ్ తమ్ముడు పేరుతో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే అక్క కోసం తమ్ముడు చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో వచ్చే 'మాట పోయి మనిషి బతికినా.. మనిషి పోయినట్టే లెక్క.. మాట బతికి మనిషి పోతే.. మనిషి బతికున్నట్లే లెక్క' అనే డైలాగ్ ఆడియన్స్‌లో అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో సౌరభ్ సచ్‌దేవా, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement