
రాబిన్‌హుడ్ తర్వాత నితిన్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందకొచ్చారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళే థియేటర్లలో విడుదలంది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. అయితే తొలి రోజే ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది. ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే మొదటి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్న తమ్ముడు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ఏ ఓటీటీలో రానుందని తెగ వెతికేస్తున్నారు. ఈ సినిమా విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో సందడి చేసే అవకాశముంది. ఈ సినిమాను హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి వచ్చే రెస్పాన్స్ చూస్తే కాస్తా త్వరగానే ఓటీటీలోకి సందడి చేసే ఛాన్స్ కనిపిస్తోంది.