నితిన్‌ ‘తమ్ముడు’ సినిమా కాన్సెప్ట్‌ ఇదేనా..? | Nithiin's 'Thammudu' Movie Launch At Hyderabad - Sakshi
Sakshi News home page

నితిన్‌ ‘తమ్ముడు’ సినిమా కాన్సెప్ట్‌ ఇదేనా..?

Aug 28 2023 1:15 AM | Updated on Aug 28 2023 9:29 AM

Nithiin Thammudu Movie Launch At Hyderabad - Sakshi

నితిన్  హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘తమ్ముడు’ టైటిల్‌ ఖరారైంది. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు అనిల్‌ రావిపూడి కెమెరా స్విచ్చాన్  చేయగా, ఫైనాన్షియర్‌ ప్రసాద్‌ క్లాప్‌ కొట్టారు. దర్శకుడు వంశీ పైడిపల్లి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘కొన్ని సినిమా టైటిల్స్‌ చాలా బాధ్యతతో వస్తుంటాయి.

మీ అంచనాలకు మించి ఉండేలా ఈ సినిమా చేస్తాం’’ అని పేర్కొన్నారు నితిన్‌. ‘‘సెప్టెంబర్‌ 1నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. ‘దంగల్, కహానీ, తారే జమీన్‌ పర్‌’ లాంటి సక్సెస్‌ ఫుల్‌ చిత్రాలకు వర్క్‌ చేసిన సత్యజిత్‌ పాండే (సేతు) ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. అయితే అక్క– తమ్ముళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే యాక్షన్  డ్రామాగా ఈ చిత్రం ఉండనుందని టాలీవుడ్‌ టాక్‌.

Advertisement
 
Advertisement
Advertisement