ఆ విషయంలో మంచు విష్ణుని ఫాలో అవుతాం : దిల్‌ రాజు | Dil Raju Says Manchu Vishnu Take Good Decision About Kannappa | Sakshi
Sakshi News home page

‘కన్నప్ప’ విషయంలో విష్ణు నిర్ణయం మంచిదే.. ఫాలో అవుతాం : దిల్‌ రాజు

Jul 2 2025 12:42 PM | Updated on Jul 2 2025 3:24 PM

Dil Raju Says Manchu Vishnu Take Good Decision About Kannappa

నెగెటివ్‌ ట్రోలింగ్‌ని, ఫేక్‌ రివ్యూస్‌ని అరికట్డడంలో మంచు విష్ణుని ఫాలో అవుతాం అంటున్నారు ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు. కన్నప్ప సినిమా విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడేదని అభినందించాడు. ఇకపై మేము కూడా అదే ఫాలో అవుతామని చెప్పారు.

మంచు విష్ణు తీసుకున్న నిర్ణయం ఏంటి?
మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం కన్నప్ప జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్‌కి రెండు రోజుల ముందే మంచు విష్ణు ఓ హెచ్చరికను జారీ చేశారు. కన్నప్ప సినిమాని టార్గెట్‌గా చేసుకొని కావాలని ఎవరైన నెగెటివ్‌గా పోస్టులు పెట్టిన, వ్యక్తిగత హననానికి పాల్పడినా.. ఉద్దశ్యపూర్వకంగా విమర్శలు చేస్తూ పరువుకు భంగం కలిగిస్తే కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ పబ్లిక్‌ కాషన్‌ నోటీస్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇది మంచి ఫలితాన్నే ఇచ్చింది. రిలీజ్‌ తర్వాత ఫేక్‌ రివ్యూస్‌, నెగెటివ్‌ ట్రోలింగ్‌ పెద్దగా జరగలేదు. ట్వీటర్‌లో సినిమాపై, మంచు ఫ్యామిలీపై నెగెటివ్‌ పోస్ట్‌లు పెట్టలేదు. సినిమాకు విమర్శల కంటే ప్రశంసలే ఎక్కువగా వచ్చాయి.

అదే ఫాలో అవుతాం : దిల్‌ రాజు
సినిమాను కాపాడాడానికి ఎవరు ఏ మంచి చేసినా.. మేమంతా అది ఫాలో అవుతామని అన్నారు దిల్‌ రాజు. ఆయన నిర్మించిన తాజా చిత్రం తమ్ముడు జులై 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. నెగెటిట్‌ ట్రోలింగ్‌పై స్పందించారు. ‘కన్నప్ప చిత్రబృందం మంచి నిర్ణయం తీసుకుంది. రిలీజ్‌కు ముందే అలా ఒక హెచ్చరిక జారీచేస్తే.. ఫేక్‌ రివ్యూస్‌, నెగెటివ్‌ ట్రోలింగ్‌, పైరసీ తగ్గిపోతుంది. అలా అని రివ్యూస్‌ని ఆపడం మా ఉద్దేశం కాదు. రివ్యూస్‌ రాయండి. కానీ రాసే ముందు ఒక్కసారి ఆలోచించండి. సినిమాపై కావాలని నెగెటివ్‌గా రాస్తే.. ఎక్కువగా నష్టపోయేది నిర్మాత మాత్రమే. హీరోలు, దర్శకులు ఈ సినిమా కాకపోతే మరో సినిమాతో హిట్‌ కొడతారు. కానీ నిర్మాత అయితే ఆ సినిమాకు డబ్బులు పోగొట్టుకోవాల్సిందే కదా? అది దృష్టిలో పెట్టుకొని జన్యూన్‌గా రివ్యూస్‌ ఇవ్వండి. దయచేసి హెల్ప్ చేయకపోయినా పర్లేదు ..డ్యామేజ్‍ మాత్రం చేయెద్దు’ అని దిల్‌ రాజు విజ్ఞప్తి చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement