
తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు టాలీవుడ్ హీరో నితిన్. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్లుగా నటించారు. చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న లయ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో జూలై 04న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో తమ్ముడు మూవీ రిలీజ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈవెంట్‌కు హాజరైన దర్శకుడు వేణు శ్రీరామ్ తన జర్నీ గురించి మాట్లాడారు.
తన జీవితంలో మొదటి స్నేహితురాలు అక్క అని వేణు శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన తన సోదరిని అందరికీ పరిచయం చేశారు. నా జీవితంలో మొట్టమొదటి కెమెరా మా అక్కనే కొనిచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. తనకు తొందరగానే పెళ్లి అయిపోందన్నారు. నా మొదటి షార్ట్ ఫిలిం ఆ కెమెరాతోనే తీశానని వేణు శ్రీరామ్ వెల్లడించారు. మా అక్క కష్టపడేతత్వం కలిగిన వ్యక్తి అని కొనియాడారు.