Thammudu Movie Heroine Aditi Govitrikar Latest Photos And Biography In Telugu - Sakshi
Sakshi News home page

Aditi Govitrikar: ‘తమ్ముడు’ సినిమా హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా?

Feb 5 2023 12:57 PM | Updated on Feb 5 2023 1:46 PM

Thammudu Movie Heroine Aditi Govitrikar Biography, Latest Photos - Sakshi

‘హే పిల్లా నీ పేరు లవ్లీ.. జారిపోకే చేపల్లే తుళ్లి.. జాంపండులా ఉన్నావే బుల్లి’ ఈ పాట వినగానే మీకు ఎవరు గుర్తుకొస్తారు? ఎర్ర చొక్కాలో లుంగీ కట్టిన పవన్‌ కల్యాణ్‌ మన కళ్ల ముందుకు వస్తాడు. ఆ తర్వాత ఓ బ్యూటీ బ్లాక్‌ టీషర్ట్‌ వేసీ రైల్వే స్టేషన్‌లో అలా నడుస్తున్నట్లు కనిపిస్తుంది కదా? ఆ బ్యూటీ పేరే అదితి గోవిత్రికర్‌. . 1999లో తమ్ముడు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ అందాల భామ,  ఆ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా చేసిన తనదైన నటనతో మెప్పించింది. 

ఆ తర్వాత  ‘సోచ్’ అనే చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ  ’16 డిసెంబర్’, ‘బాజ్’, ‘డే దనా దన్’, ‘భేజా ఫ్రై 2’, ‘స్మైల్ ప్లీజ్’, ‘కోయి జానే నా’ లాంటి చిత్రాల్లో నటించింది. అయితే అవేవి బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. సినిమా అవకాశాలు తగ్గడంతో బుల్లితెరపై కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది అదితి. ఆ తర్వాత పలు వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించింది. ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటూ లండన్‌లోని హార్వర్డ్ యూనివర్సిటీలో సైకాలజీలో రెండో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది.

ఇక అదితి వ్యక్తిగత విషయాలకొస్తే.. 1998లోనే దావూడి బొహ్ర అనే వ్యక్తిని పెళ్ళాడింది. ఇద్దురు పిల్లలు పుట్టాక వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు దూరమయ్యారు. 2007లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం అదితి తన పిల్లలతో కలిసి ముంబైలోని సోదరి ఆర్జూ గోవిత్రికర్‌తో నివసిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement