చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (CCT)కు కేంద్ర హోంశాఖ గుడ్‌న్యూస్ తెలిపింది. సుమారు 27 ఏళ్లుగా ఛారిటబుల్ ట్రస్టు కింద బ్లడ్ బ్యాంక్‌తో పాటు ఐ బ్యాంకు కూడా చిరంజీవి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (Chiranjeevi Charitable Trust)ను ఎఫ్‌సీఆర్‌ఏ కింద నమోదుకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకనుంచి విదేశీ విరాళాలు తీసుకునే వెసులుబాటును ట్రస్టుకు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కొద్దిరోజుల క్రితమే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2010 ప్రకారం ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి తీసుకోవాలని నిబంధనల్లో మార్పు చేశారు. దీంతో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి కోసం కేంద్రాన్ని కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఆమోద ముద్రవేసినట్టు తెలుస్తోంది.


