
ఊహ తెలియని వయసులో కెమెరా ముందు చురుకుగా యాక్ట్ చేశాడు. దాదాపు 25కి పైగా సినిమాలు చేశాడు. కానీ, విక్రమార్కుడు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్‌గానే అందరికీ ఎక్కువగా గుర్తుండిపోయాడు. అతడే రవి రాథోడ్ (Ravi Rathod).. అతడి టాలెంట్ చూసిన రాఘవ.. ముందుగా పిల్లాడికి మంచి చదువు అవసరం అని భావించాడు. రవిని దత్తత తీసుకుని పెద్ద స్కూల్‌లో చేర్పించాడు. కానీ అతడికి చదువు అబ్బలేదు. అసలు చదవాలన్న ఆసక్తే లేకపోవడంతో లారెన్స్‌కు ఒక్క మాటైనా చెప్పకుండా స్కూలు మానేశాడు.
తాగుడుకు బానిస
తర్వాతికాలంలో చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ వస్తున్నాడు. మద్యానికి బానిసై మందు తాగకపోతే బతకను అనే స్టేజీకి దిగజారిపోయాడు. అతిగా మద్యం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చాయి. కిడ్నీలో రాళ్లు చేరి.. సరిగా నడవలేని స్థితికి చేరుకున్నాడు. అతడి పరిస్థితి తెలుసుకున్న రాఘవ లారెన్స్ (Raghava Lawrence)కు గుండె తరుక్కుపోయింది. రవిని ఒక్కసారి కలవమని సోషల్ మీడియా వేదికగా కోరాడు.
రాఘవతో రవి రాథోడ్
దీంతో రవి రాథోడ్.. చెన్నై వెళ్లి లారెన్స్‌ను కలిశాడు. మద్యానికి బానిసైన విషయం తెలిసి రాథోడ్‌పై కోప్పడ్డాడు. తన మంచి కోరుతున్న లారెన్స్ కోసం.. జీవితంలో మళ్లీ మందు ముట్టనని మాటిచ్చాడు. ఆయన ఇచ్చిన డబ్బుతో తనకంటూ ఓ ఫోన్ కొనుక్కుని ఆరోగ్యంపై ఫోకస్ చేశాడు. తాజాగా అతడు లారెన్స్‌తో కలిసి దిగిన ఫోటో షేర్ చేశాడు. ఇది చూసిన జనాలు.. రాఘవ మంచి మనసును మరోసారి మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఇతడి ఆస్పత్రి బిల్లులు కూడా లారెన్సే చూసుకోవడం విశేషం!