
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ (They Call Him OG Movie). ఇందులో పవన్.. గ్యాంగ్‌స్టర్‌గానే కాకుండా తండ్రి పాత్రలోనూ యాక్ట్ చేశారు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. సినిమాలో పవన్- ప్రియాంకల కూతురిగా సాయేషా అనే పాప యాక్ట్ చేసింది. వెండితెరపై ఆమె నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం!
ఇదే ఫస్ట్ మూవీ!
ముంబైకి చెందిన సాయేషా ఇప్పటివరకు అనేక వాణిజ్య ప్రకటనల్లో నటించింది. సంతూర్, లెన్స్‌కార్ట్, ఫస్ట్‌క్రై వంటి బ్రాండ్స్‌తో పాటు రియల్ ఎస్టేట్ యాడ్స్‌లోనూ యాక్ట్ చేసింది. మృణాల్ ఠాకూర్‌తోనూ ఓ రియల్ ఎస్టేట్ యాడ్‌లో నటించింది. ఇప్పుడీ చిన్నారి సినిమాల వైపు అడుగులు వేస్తోంది. లాగౌట్ అనే హిందీ సినిమాలో చిన్న పాత్రలో యాక్ట్ చేసింది. కానీ ఇది నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు ఓజీ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తనకు మొదటి సినిమా అయినప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా అద్భుతంగా నటించింది.

అందరికీ థాంక్స్
ఈ పాపను చూసిన వారంతా తనకు మంచి భవిష్యత్తు ఉందని మెచ్చుకుంటున్నారు. ఓజీ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌తో దిగిన ఫోటోలను సాయేషా సోషల్ మీడియాలో షేర్ చేసింది. హీరోయిన్ ప్రియాంకతో ఆటలు ఆడుకోవడం మిస్ అవుతానంది. తనకు చాక్లెట్లు ఇచ్చిన అర్జున్‌దాస్‌కు కృతజ్ఞతలు చెప్పింది. ప్రకాశ్ రాజ్‌తో పని చేయడం ఆనందంగా ఉందని తెలిపింది. తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సుజిత్‌కు, అలాగే పవన్ సహా ఓజీ టీమ్‌కు థాంక్స్ చెప్పింది.
చదవండి: ఆమె పనిచేసేది 8 గంటలే.. ఇంకెక్కడొస్తుంది!: దీపికపై సెటైర్లు