ఢిల్లీ హైకోర్టుకు ఎన్టీఆర్‌ కృతజ్ఞతలు | Actor Jr NTR Special Thanks To delhi High court | Sakshi
Sakshi News home page

ఢిల్లీ హైకోర్టుకు ఎన్టీఆర్‌ కృతజ్ఞతలు

Dec 30 2025 10:10 AM | Updated on Dec 30 2025 11:04 AM

Actor Jr NTR Special Thanks To delhi High court

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. కొద్దిరోజుల క్రితం తారక్‌ తన వ్యక్తిగ‌త‌ హక్కులను కాపాడాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు అనుకూల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సోషల్ మీడియా వేదికగా.. పలు ఈ–కామర్స్ వెబ్‌సైట్లలో తన పేరుతో పాటు ఫొటోలు, వీడియోలను ఎలాంటి అనుమతి లేకుండా తమ వ్యాపారా లాభాల కోసం వినియోగించడం వల్ల తన వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతోందని ఢిల్లీ కోర్టును తారక్‌ ఆశ్రయించారు. తమ వ్యాపార అవసరాల కోసం   సామాజిక మాధ్యమాల్లో  తప్పుడు ప్రచారం చేస్తూ.. తమ పేరును దుర్వినియోగం చేస్తున్న వారికి అడ్డుకట్టవేయాలని ఆయన కోరారు. ఎన్టీఆర్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తారక్‌ వ్యక్తిగ‌త‌ హక్కులను రక్షించేలా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

వారికి ధన్యవాదాలు: ఎన్టీఆర్‌
'నేటి డిజిటల్ యుగంలో నా వ్యక్తిత్వ హక్కులను కాపాడే రక్షణాత్మక ఉత్తర్వును మంజూరు చేసినందుకు గౌరవనీయులైన ఢిల్లీ హైకోర్టుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సుప్రీంకోర్టు న్యాయవాదులు డాక్టర్ బాలజానకి శ్రీనివాసన్, డాక్టర్ అల్కా డాకర్, శ్రీ రాజేందర్‌తో పాటు వారి టీమ్‌ అందించిన లిగల్‌ సపోర్ట్‌కు ధన్యవాదాలు.' అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement