
తల్లయ్యాక తనకంటూ కొన్ని హద్దులు గీసుకుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone). రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పని చేయలేనని కరాఖండిగా చెప్తోంది! భారీ బడ్జెట్ సినిమాలకు ఇలాంటి కండీషన్లు పెడితే కష్టమని కల్కి 2 నుంచి ఆమెను తప్పించేశారు. దానికంటే ముందు స్పిరిట్ నుంచి కూడా దీపికా సైడ్ అయిపోయింది. దీంతో అసలు 8 గంటల షిఫ్ట్ తప్పా? ఒప్పా? అని ఎవరికి వారు చర్చల్లో మునిగిపోయారు.
8 గంటలే దీపిక పని
అయితే ఈ విషయంపై దీపికాపై ఫన్నీ సెటైర్లు వేసింది బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ (Farah Khan). తన చెఫ్ దిలీప్‌తో కలిసి ముంబైలో నటుడు రోహిత్ సరఫ్ ఇంటికి వెళ్లింది ఫరా. ఈ మేరకు ఓ యూట్యూబ్ వ్లాగ్ చేసింది. అందులో మొదటిసారి రోహిత్ సరఫ్ తల్లిని చూపించింది. నా సినిమా కోసం దీపికను ఒప్పించడానికి కూడా ఇంత సమయం పట్టలేదేమో! అంటూ రోహిత్ తల్లిని హత్తుకుంది. ఇంతలో ఫరా చెఫ్ దిలీప్.. దీపిక పదుకొణె మేడమ్ మన షోకి ఎప్పుడొస్తారు? అని అడిగాడు. అందుకామె.. దీపిక ఇప్పుడు రోజులో 8 గంటలు మాత్రమే పని చేస్తుంది. మన షోకి వచ్చేంత తీరిక తనకెక్కడిది? అంది.

సినిమా
ఫరాఖాన్ దర్శకత్వంలోనే దీపిక బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమైంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ ఓం శాంతి ఓం. ఇందులో షారూఖ్ హీరోగా నటించాడు. ఫరా, దీపికా, షారూఖ్.. ముగ్గురూ కలిసి హ్యాపీ న్యూ ఇయర్ (2014) అనే మరో సినిమా చేశారు. ఆమధ్య 'కల్కి' మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొణె.. చివరగా ఫైటర్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం షారూఖ్ ఖాన్‌తో కలిసి 'కింగ్' మూవీ చేస్తోంది. అలాగే అట్లీ-అల్లు అర్జున్ సినిమాలోనూ భాగమైంది. ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ అనే హాలీవుడ్ సినిమా సీక్వెల్‌లోనూ భాగమైనట్లు ప్రచారం జరుగుతోంది.