నా భార్య బ్రష్‌తో పళ్లు తోముకుంటున్నా: షెఫాలీ భర్త | Parag Tyagi’s Emotional Tribute to Late Wife Shefali Jariwala | Tattoo, Memories & Podcast | Sakshi
Sakshi News home page

నా భార్య బ్రష్‌తో పళ్లు తోముతున్నా, ఆమె విడిచిన బట్టల్నే కప్పుకుంటున్నా..

Sep 27 2025 10:57 AM | Updated on Sep 27 2025 12:05 PM

Parag Tyagi: I Brush My Teeth with Shefali Jariwala Brush

బతికున్నప్పుడు ఆమె చేయి వదల్లేదు, చనిపోయాక తన జ్ఞాపకాలను, గుర్తులను వదలడం లేదు. ఆమె జీవించినప్పుడే కాదు మరణం తర్వాత కూడా తనని ప్రాణానికి ప్రాణంగా ‍ప్రేమిస్తున్నాడు. 'కాంటా లగా' సాంగ్‌ ఫేమ్‌, బాలీవుడ్‌ నటి షెఫాలీ జరివాలా (Shefali Jariwala) మరణించి మూడు నెలలు కావస్తున్నా ఆమెను క్షణమైనా మర్చిపోలేకున్నాడు భర్త, నటుడు పరాగ్‌ త్యాగి (Parag Tyagi). అందుకే అణువణువునా ఉన్న ప్రేమను పచ్చబొట్టు రూపంలో హృదయంపై ఆమె ముఖచిత్రాన్ని పదిలంగా పరుచుకున్నాడు. 

భార్య దిండుపైనే నిద్ర
తాజాగా  'షెఫాలీ పరాగ్‌ త్యాగి' అంటూ ఓ పాడ్‌కాస్ట్‌ చానల్‌ను ప్రారంభించాడు. ఇందులో మొదట తన సెల్ఫ్‌ ఇంటర్వ్యూ ఇచ్చాడు. పరాగ్‌ మాట్లాడుతూ.. షెఫాలీ బ్రష్‌తోనే నా పళ్లు తోముకుంటున్నాను. తన దిండుపైనే నిద్రిస్తున్నాను. తన టీషర్ట్స్‌, షార్ట్స్‌ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. వాటినెప్పుడూ నాపక్కనే పెట్టుకుంటున్నాను. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో తను ఆర్డర్‌ చేసిన వస్తువులు ఇప్పటికీ డెలివరీ అవుతూనే ఉన్నాయి. ఆమె విడిచిన బట్టల్ని ఇంతవరకు ఉతకలేదు. అవి మరీ చిన్నగా ఉండటం వల్ల ధరించలేకపోతున్నాను. కానీ, వాటిని కప్పుకునే ప్రతిరోజు నిద్రిస్తున్నాను.

సీపీఆర్‌ చేశా..
షెఫాలీ చివరిరోజు మా సింబా(పెంపుడు శునకం)ను వాకింగ్‌కు తీసుకెళ్లమని నాకు చెప్పింది. బయటకు వెళ్లి వచ్చేలోపు అపస్మారక స్థితిలో పడి ఉంది. సీపీఆర్‌ కూడా చేశాను. రెండుసార్లు శ్వాస తీసుకుంది. ఆ వెంటనే కన్నుమూసింది అని చెప్పుకొచ్చాడు. యాంటీఏజింగ్‌ డ్రగ్స్‌ వల్లే షెఫాలీ మరణించిందన్న వార్తలను పరాగ్‌ కొట్టిపారేశాడు. తనెప్పుడూ డ్రగ్స్‌ వాడలేదని క్లారిటీ ఇచ్చాడు. కేవలం మల్టీ విటమిన్స్‌ టాబ్లెట్స్‌ తీసుకునేదని తెలిపాడు.

చదవండి: మిడ్‌నైట్‌ ఎలిమినేషన్‌.. కార్నర్‌ చేసి పంపించారు! నేరుగా సీక్రెట్‌రూమ్‌కు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement