తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఊరట | Supreme Court Key Statement Over Telangana Group-1 Exams | Sakshi
Sakshi News home page

తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఊరట

Oct 9 2025 11:26 AM | Updated on Oct 9 2025 1:22 PM

Supreme Court Key Statement Over Telangana Group-1 Exams

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గ్రూప్‌-1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యానికి సుప్రీం నిరాకరించింది. ఈనెల 15న విచారణ ఉన్న నేపథ్యంలో  జోక్యం చేసుకోలేమన్న కోర్టు స్పష్టం చేసింది.

కాగా, తెలంగాణలో గ్రూప్-1 ర్యాంకర్ల నియామకాలపై తెలంగాణ హైకోర్టు తీర్పును వేముల అనుష్ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర తీర్పు ఇచ్చినందున ఈ దశలో జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం పేర్కొంది. హైకోర్ట్ డివిజన్ బెంచ్‌లో ఈనెల 15న విచారణ ఉన్న నేపథ్యంలో  జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఇక, ఇప్పటికే రెండ్రోజుల క్రితం ఇదే కేసులో మరో పిటిషనర్ వేసిన పిటిషన్ సందర్భంగా హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement