
ఆసియా కప్ హీరో తిలక్ వర్మను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సన్మానించారు.

ప్రస్తుతం మనశంకరవరప్రసాద్‌గారు మూవీలో నటిస్తోన్న చిరు.. ఈ టీమిండియా క్రికెటర్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా మూవీ సెట్‌లో కేక్ కట్ చేసిన తిలక్ వర్మకు.. ఆసియా కప్ ఫైనల్ నాటి ఫోటోను బహుమతిగా ఇచ్చారు.

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో నయనతార, అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి, సుష్మిత కొణిదెల పాల్గొన్నారు.





















