
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ చిరుత (2007) సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. హీరోయిన్ శ్రియ 2001లో వచ్చిన ఇష్టం చిత్రంతో సినిమాల్లో ప్రవేశించింది. అంటే చరణ్ కంటే శ్రియ సీనియర్. వీరిద్దరూ జంటగా ఏ సినిమాలోనూ నటించలేదు. ఆ మధ్య వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌లో చరణ్ తల్లిగా కనిపించింది.
తొలిసారి కెమెరా ముందు రామ్‌చరణ్
దానికంటే ముందు కూడా వీరు కలిసి యాక్ట్ చేశారు. అదెప్పుడంటారా? ఓ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఓ సీన్ ప్రాక్టీస్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను సదరు ఇన్‌స్టిట్యూట్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా యాక్టింగ్ కోచ్ కిశోర్ నమిత్ కపూర్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ (Ram Charan), శ్రియా శరణ్‌లపై ఓ సీన్ చిత్రీకరించాం. చరణ్ కెమెరా ముందుకు రావడం ఇదే మొదటిసారి.
ఇబ్బందిపడ్డ చరణ్
చెప్పాలంటే అది ఒక వరంలాంటిది. ఫస్ట్ టైం కావడంతో చరణ్ చాలా ఇబ్బందిగా ఫీలయ్యాడు. శ్రియా (Shriya Saran) అప్పటికే దక్షిణాదిన స్టార్ హీరోయిన్ అయిపోయింది. చాలా సినిమాలు చేసింది. కానీ శిక్షణ తీసుకుంటే మరింత రాటుదేలుతుందని నా అభిప్రాయం. కోచ్‌గా తనకెప్పుడూ పాజిటివ్ ఫీడ్‌బ్యాకే ఇచ్చాను అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ క్లిప్ వైరల్‌గా మారింది. అందులో చరణ్ కాస్త పొడవుగా పెంచిన జుట్టు, గడ్డం, కళ్లజోడుతో కనిపించాడు. కెమెరా వంక చూసేందుకు సిగ్గుపడ్డాడు. డైలాగులు చెప్పేందుకు తనలో తానే ఘర్షణకు లోనయ్యాడు.
అప్పటికీ, ఇప్పటికీ అంతే అందం!
అప్పటికే శ్రియ దక్షిణాదిలో పాపులర్ హీరోయిన్ కావడంతో ఏమాత్రం బెరుకు లేకుండా యాక్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు.. చరణ్ ఇలా ఉన్నాడేంటి? అని ఆశ్చర్యపోతున్నారు. అప్పుడెలా ఉన్నాడు? ఇప్పుడే రేంజ్‌కు ఎదిగిపోయాడు అని కొందరు అబ్బురపడుతున్నారు. శ్రియ.. అప్పటికీ, ఇప్పటికీ అంతే అందంగా ఉందని ప్రశంసిస్తున్నారు. శ్రియ చివరగా మిరాయ్ సినిమాలో నటించింది. రామ్‌చరణ్ చివరగా గేమ్ ఛేంజర్ మూవీ చేశాడు. ప్రస్తుతం బుచ్చిబాబుతో పెద్ది సినిమా చేస్తున్నాడు.
చదవండి: స్టేజీపై హీరోయిన్ బుగ్గ గిల్లి, జుట్టు పట్టుకుని లాగిన హీరో