
ప్రముఖ తెలుగు యాంకర్ లాస్య (Anchor Lasya Manjunath) కొత్తింట్లో అడుగుపెట్టింది. భర్త మంజునాథ్‌తో కలిసి బుధవారం గృహప్రవేశం చేసింది. ఈ వేడుకను ఘనంగా జరుపుకుంది. బంధుమిత్రులతో పాటు బుల్లితెర సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. వారిలో నయని పావని, బంచిక్ బబ్లూ, గీతూ రాయల్, దేత్తడి హారిక, నోయెల్.. తదితరులు ఉన్నారు. లాస్య గృహప్రవేశానికి వెళ్లిన వారు ఆమె ఇల్లు చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు.
కుళ్లుకుంటావ్..
లాస్య ఫ్రెండ్ నోయెల్ (Noel Sean) అయితే ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. 'నా ఇల్లు చూసి నువ్వు కచ్చితంగా కుళ్లుకుంటావు' అని లాస్య నాతో అంది. నిజంగానే ఇల్లు చూశాక నేను జెలసీగా ఫీలయ్యాను. ఇల్లు అంత బాగుంది. ఆ దేవుడు మీ జంటను ఎప్పుడూ ఇలాగే ఆశీర్వదించాలి అంటూ లాస్యతో దిగిన ఫోటోలు షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు లాస్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
బిగ్‌బాస్ నుంచి ఫ్రెండ్స్
బుల్లితెర ఇండస్ట్రీలో యాంకర్‌గా ఓ వెలుగు వెలిగింది లాస్య. మంజునాథ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె వైవాహిక జీవితంలో అడుగుపెట్టాక కెరీర్‌కు గ్యాప్ ఇచ్చింది. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేది. తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొంది. ఆ సమయంలోనే లాస్య, దేత్తడి హారిక, నోయెల్ సేన్ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇకపోతే పేరెంట్స్ కోసం గతంలో ఇల్లు కట్టించిన లాస్య.. నాలుగు నెలల కిందట తండ్రికి మంచి కారును బహుమతిగా ఇచ్చింది.
చదవండి: శ్రియాతో లవ్ సీన్.. ఇబ్బందిపడ్డ రామ్‌చరణ్.. వీడియో చూశారా?