
కన్నడ సినిమా కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరిపోయిన ఈ చిత్రం కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. సోమవారం కూడా సుమారు రూ. 20 కోట్లకు పైగానే రాబట్టినట్లు బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి. 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.675 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. దీంతో బాహుబలి-1 ఫైనల్ కలెక్షన్స్ మార్క్‌ను కాంతార దాటేసింది.
అయితే, కాంతారా చాప్టర్ 1 అమెరికాలో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టినప్పటికీ గణనీయమైన నష్టాలను చవిచూసే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు, ఈ చిత్రం దాదాపు రూ. 4 మిలియన్ల డాలర్స్ (రూ. 36 కోట్లు) వసూలు చేసింది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా తాజాగా మేకర్స్ షేర్ చేశారు. ఈ కలెక్షన్స్ నంబర్ పర్వాలేదనిపించినప్పటికీ బ్రేక్-ఈవెన్ మార్కుకు చాలా దూరంలో ఉంది. ఈ సినిమాను చాలా ఎక్కువ ధరకు అమెరికాలో కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ చేయడానికి దాదాపు రూ. 8 మిలియన్ల డాలర్స్ అవసరం అవుతుంది. ఆ మార్క్‌ను కాంతార అందుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. దీంతో అమెరికాలో కాంతార నష్టాలు మిగల్చడం తప్పదని సమాచారం.
అయితే, తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ బెల్ట్‌లో మాత్రం భారీ లాభాల దిశగా కాంతార దూసుకుపోతుంది. దీపావళి సందర్భంగా ఈ వారంలో మరో నాలుగు ప్రధాన సినిమాలు విడుదల కానున్నడంతో కాంతారా చాప్టర్ 1 కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా మరింత తగ్గే ఛాన్స్ ఉంది. ఏదేమైనా మరో మూడు రోజులు మాత్రమే కాంతార సందడి కనిపించనుంది. ఈ ఏడాదిలో ఛావా సినిమా రూ. 800 కోట్ల కలెక్షన్స్‌తో టాప్ వన్‌లో ఉంది. ఇప్పుడు కాంతార కూడా ఆ మార్క్‌ను అందుకోవాలని చూస్తుంది. 2022లో విడుదలైన కాంతార చిత్రానికి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్ 1 నిర్మించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు.