
ఓటీటీల్లోకి ప్రతివారం కొత్త సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు థియేటర్లలో కాకుండా నేరుగా కొన్ని మూవీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. ఇప్పుడు అలానే ఓ తెలుగు థ్రిల్లర్ సిరీస్ డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటనతో పాటు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఏంటా సిరీస్? ఎందులోకి రానుంది?
రాజీవ్ కనకాల, ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు సిరీస్ 'డాటరాఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు'. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ స్టోరీతో దీన్ని తీశారు. ఇది ఇప్పుడు నేరుగా జీ5 ఓటీటీలో ఈ నెల 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. రెక్కీ, విరాటపాలెం తదితర సిరీసులు తీసిన సౌతిండియన్ స్క్రీన్స్ దీన్ని నిర్మించింది. పోలూరు కృష్ణ దర్శకుడు. రాజీవ్ కనకాల తండ్రిగా చేయనుండగా.. అతడి కూతురు స్వాతిగా వాసంతిక నటించింది. ఉదయభాను పోలీస్ పాత్రలో కనిపించనుంది.
(ఇదీ చదవండి: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బ్యాచిలర్ పార్టీ!)
ఈ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో తండ్రైన రాజీవ్ కనకాల.. కనిపించకుండా పోయిన తన కూతురు స్వాతి కోసం వెతుకుతుంటాడు. తండ్రికి ఏం చేయాలో తెలియక అన్వేషిస్తుంటాడు. ఈ క్రమంలో నిజానికి దగ్గరయ్యే కొద్ది తనకు తెలిసే రహస్యాలు, మోసాలు వెనుక దాగిన ఊహించని నిజాలు ఏంటి? ప్రేమ, కోల్పోయినప్పుడు ఉండే వెలితి, మోసం మధ్య ఉండే సన్నని సరిహద్దులు కనిపించకుండా పోతాయి. బాధ, భావోద్వేగం కలగలిసిన ఈ ప్రయాణమే అసలు స్టోరీ.
ఇకపోతే ఈ వారం 20కి పైగా కొత్త చిత్రాలు, సిరీసులు పలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వీటిలో తేజా సజ్జా 'మిరాయ్', 'త్రిబాణధారి బార్బరిక్', ఎన్టీఆర్ 'వార్ 2', లీగల్లీ వీర్ అనే తెలుగు మూవీస్ ఉన్నాయి. వీటితో పాటు 'కురుక్షేత్ర' అనే యానిమేటెడ్ తెలుగు డబ్బింగ్ సిరీస్ కూడా ఈ వీకెండ్‌లోనే అందుబాటులోకి రానుంది. ఇవే కాకుండా శుక్రవారం నాడు ఏమైనా సడన్ సర్‌ప్రైజ్ ఉండొచ్చు!
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు)
