
హైదరాబాద్ నగరంలో డిజైనింగ్ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులను పలు ఫ్యాషన్ బ్రాండ్స్ ప్రతినిధులు బుధవారం కలిశారు. నగరానికి చెందిన ప్రముఖ డిజైనింగ్ ఇన్‌స్టిట్యూట్ హామ్స్ టెక్ ఆధ్వర్యంలో నాగార్జునహిల్స్‌లో నిర్వహించిన కెరీర్ కనెక్ట్ కార్యక్రమానికి హాజరైన వందలాది విద్యార్థులకు దేశవ్యాప్తంగా పేరొందిన పలు ఫ్యాషన్ బ్రాండ్స్‌కు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
డిజైనర్లలో సృజనాత్మక శక్తిని, ఇప్పటి వరకూ చేసిన వర్క్స్‌ను బేరీజు వేసుకుని వారికి అవకాశాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ విధానంలో ఇప్పటికే పలువురు విద్యార్థులు అరవింద్ ఫ్యాషన్స్, షాపర్స్ స్టాప్, లేబొల్ ది స్టోరీ, సింఘానియా, ఐశారావు, మై పర్‌ఫెక్ట్ ఫిట్ తదితర బ్రాండ్లతో కలిసి పనిచేసేందుకు ఎంపికయ్యారని వివరించారు.
పట్నంలో.. గ్రామీణభారత్ మహోత్సవం
చేనేత కార్మికులు, హస్తకళ కళాకారులు, ఇతర మహిళా సంఘాలు సృష్టించిన చేనేత–హస్తకళా ఉత్పత్తులను ఎలాంటి మధ్యవర్తులు లేకుండా వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా అమీర్‌పేట్‌లోని కమ్మ సంఘం వేదికగా ఏర్పాటు చేసిన ‘గ్రామీణ భారత్ మహోత్సవం’ బుధవారం ప్రారంభమైంది.
నాబార్డ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ గ్రామీణ భారత్ మహోత్సవాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ప్రారంభించారు. 15వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో దాదాపు 21 రాష్ట్రాలకు చెందిన 53 స్టాల్స్‌లో చేనేత, హస్తకళాకారులు తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నారు. ఇందులో మన రాష్ట్రం నుంచి 14 స్టాల్స్ ఉన్నాయి.
(చదవండి: అంతరిక్ష వేదికపై హైదరాబాద్..!)