
మూడేళ్ల క్రితం ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార సినిమా (Kantara Movie) బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కేవలం రూ.15- 20 కోట్లతో నిర్మిస్తే ఏకంగా రూ.450 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ప్రీక్వెల్‌గా కాంతార: చాప్టర్ 1 (Kantara: Chapter 1 Movie) తెరకెక్కించారు. కాంతార లాగే.. కాంతార 1 బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందా? ప్రేక్షకుల్ని మెప్పిస్తుందా? లేదా? అన్న అనుమానాలు ఉండేవి.
తెలుగులో రికార్డు
ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది కాంతార 1. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వం వహించి హీరోగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తూ వసూళ్ల ఊచకోత కొనసాగిస్తూనే ఉంది. ఈ రెండు వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.105 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.717.50 కోట్లు కలెక్ట్ చేసి వెయ్యి కోట్ల దిశగా పరుగులు తీస్తోంది.
సినిమా
అలాగే హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాల లిస్టులోనూ చేరిపోయింది. కాంతార విషయానికి వస్తే రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈసినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.
A divine storm at the box office 💥💥#KantaraChapter1 roars past 717.50 CRORES+ GBOC worldwide in 2 weeks.
Celebrate Deepavali with #BlockbusterKantara running successfully in cinemas near you! ❤️🔥#KantaraInCinemasNow #DivineBlockbusterKantara #KantaraEverywhere#Kantara… pic.twitter.com/rd92Dch1mS— Hombale Films (@hombalefilms) October 17, 2025
The unstoppable divine saga takes over the box office 🔥#KantaraChapter1 crosses 717.50 CRORES+ GBOC worldwide, including a phenomenal 105 CRORES+ from Telugu states in just 2 weeks.
Experience the magic of #BlockbusterKantara this Deepavali in cinemas ❤️🔥#KantaraInCinemasNow… pic.twitter.com/dD584CNPMp— Ramesh Bala (@rameshlaus) October 17, 2025
చదవండి: నడవలేని స్థితిలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. రాఘవతో ఫోటో