ఎట్టకేలకు ప్రకటించేశారు.. ఓటీటీలోకి వచ్చేస్తున్న డ్యూడ్‌ | Pradeep Ranganathan And Mamitha Baiju Dude Movie OTT Release Date Confirmed, Check Out Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Dube Movie OTT Release: OTTలో రూ.100 కోట్ల సినిమా.. ఈ వారంలోనే డ్యూడ్‌ స్ట్రీమింగ్‌

Nov 10 2025 10:05 AM | Updated on Nov 10 2025 11:01 AM

Pradeep Ranganathan, Mamitha Baiju Dude Movie OTT Release Date Out

దీపావళికి రిలీజైన అన్ని సినిమాలు ఓటీటీ డేట్‌ ఇచ్చేశాయి. కిరణ్‌ అబ్బవరం 'కె-ర్యాంప్‌' నవంబర్‌ 15న ఆహాలో రిలీజ్‌ అవుతున్నట్లు ప్రకటించారు. సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' మూవీ నవంబర్‌ 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇక దీపావళి రేసులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'డ్యూడ్‌' సినిమా ఓటీటీ డేట్‌ మాత్రం అనౌన్స్‌ చేయకుండా అభిమానులను సస్పెన్స్‌లో ఉంచారు.

ఈ వారమే ఓటీటీలో
ఈ సస్పెన్స్‌కు తెర దించుతూ ఎట్టకేలకు డ్యూడ్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ (Dude Movie OTT Reelase Date) ప్రకటించారు. నవంబర్‌ 14న నెట్‌ఫ్లిక్స్‌లో రానుందంటూ ఎక్స్‌ వేదికగా పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో డ్యూడ్‌ అందుబాటులోకి రానుందని వెల్లడించారు. డ్యూడ్‌ విషయానికి వస్తే.. ప్రదీప్‌ రంగనాథన్‌, మమితా బైజు ప్రధాన పాత్రలు పోషించారు. శరత్‌కుమార్‌ కీలక పాత్రలో నటించగా కీర్తి శ్వరన్‌ దర్శకుడిగా పరిచయమయ్యాడు. మైత్రీమూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్‌ 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాగా ఈజీగా రూ.100 కోట్లు రాబట్టింది.

కథ
డ్యూడ్‌ కథేంటంటే.. గగన్‌ (ప్రదీప్‌ రంగనాథన్‌).. ఆముద (నేహా శెట్టి)ని ప్రేమిస్తాడు. కానీ మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. గగన్‌ను అతడి మేనమామ (శరత్‌ కుమార్‌) కూతురు కుందన (మమిత బైజు) ప్రేమిస్తుంది. కానీ, ఆమె పెళ్లి ప్రపోజల్‌ను గగన్‌ రిజెక్ట్‌ చేస్తాడు. కొంతకాలానికి ఆమెనే పెళ్లాడాలనుకున్న టైమ్‌కు కుందన పార్దు (హృదయ్‌)తో ప్రేమలో ఉంటుంది. అయినప్పటికీ గగన్‌-కుందనకే పెళ్లి జరుగుతుంది. వీళ్ల పెళ్లికి కారణమేంటి? తర్వాత కలిసున్నారా? లేదా? అనేది ఓటీటీలో చూసేయండి..

 

చదవండి: ముక్కోటి గొంతుకల్ని ఏకం చేసిన అందెశ్రీ.. పాటతోనే ప్రాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement