కమెడియన్‌గా, విలన్‌గా వెండితెరపై రాణిస్తున్నాడు తమిళ నటుడు మొట్ట రాజేంద్రన్. ఈయన మొదట్లో స్టంట్‌మెన్‌గా పనిచేశాడు. నాన్ కడవులే సినిమాకుగానూ రాష్ట్రస్థాయిలో అవార్డులు గెల్చుకున్నాడు. అయితే మొదట్లో రాజేంద్రన్ పలువురు నటుల స్థానంలో యాక్షన్ సీన్లు (స్టంట్ డబుల్) చేసేవాడు. ఇప్పుడు మాత్రం నటుడిగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సత్తా చాటుతున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
15 అడుగుల ఎత్తులో నుం
ఒక మలయాళ సినిమా షూటింగ్‌లో 15 అడుగుల ఎత్తులో నుంచి కింద నీళ్లలో పడాల్సి ఉంటుంది. నేను ఆలోచించకుండా దూకేశాను. తీరా ఆ ఊరివాళ్లు చూసి.. ఇదంతా ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్ వాటర్.. ఈ నీళ్లలో ఎందుకు దూకారు? అన్నారు. అలా అప్పుడే జుట్టురాలడం మొదలైంది. కొంతకాలానికే మొత్తం గుండు అయిపోయింది. కనుబొమ్మలు కూడా పోయాయి. మొదట్లో కొంత బాధపడ్డాను.
అదే ప్లస్ అయింది
అప్పటినుంచే విలన్‌గా కాకుండా కామెడీ రోల్స్ వచ్చాయి. విగ్ కూడా పెట్టుకోకుండా అలాగే ఉండమంటున్నారు. ఏదైతే మైనస్ అనుకున్నానో అదే నాకు ప్లస్ అయిపోయింది. తెలుగు ప్రేక్షకులు నన్ను థియేటర్లలో చూసి విజిల్స్ వేస్తుంటే ఒక్కోసారి ఆనందంతో కన్నీళ్లు వస్తాయి అన్నాడు. రాజేంద్రన్ తెలుగులో చలో, ఎఫ్ 3, వాల్తేర్ వీరయ్య, సర్, విమానం, దే కాల్ హిమ్ ఓజీ, త్రిబాణధారి బార్బరిక్, త్రిముఖ వంటి పలు చిత్రాల్లో నటించాడు.


