ప్రస్తుతం హారర్ సినిమాల హవా నడుస్తోంది. ఈ ఏడాది విడుదలైన అన్ని హారర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించాయి. ప్రస్తుతం అదే తరహాలో ఉత్కంఠభరితమైన కథ, కథనంతో రూపొందిన చిత్రం అమరావతికి ఆహ్వానం. శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తర్, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రల్లో నటించారు. సీనియర్ నటులు అశోక్ కుమార్, భద్రమ్, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు పోషించారు.
డైరెక్టర్ జివికె ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి గారి నిర్మాణ సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మధ్య ప్రదేశ్‌లోని పలు లొకేషన్స్‌లో షూటింగ్స్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా క్రిస్మస్ శుభాకాంక్షలతో పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ.. మా సినిమా టైటిల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని పాత్రలకి ప్రాధాన్యత ఉండేలా దర్శకుడు మంచి కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతున్నాయి అన్నారు.
దర్శకుడు జివికె మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో రిలీజైన అన్ని హారర్ సినిమాలు మంచి విజయం సాధించాయి. అదే తరహాలో మరో డిఫరెంట్ కథాశంతో వస్తోన్న చిత్రం అమరావతికి ఆహ్వానం. సీనియర్ సినిమాటోగ్రాఫర్ జె ప్రభాకర్ రెడ్డి గారి విజువల్స్, హనుమాన్ ఫేమ్ సాయిబాబు తలారి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయి. పద్మనాబ్ బరద్వాజ్ గారి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్స్‌లో ఆడియన్స్‌ని హారర్ మూడ్ క్యారీ చేసే విధంగా చేస్తుంది అన్నారు.


