
– నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్
‘‘డ్యూడ్’ వైవిధ్యమైన ప్రేమకథ. అందమైన భావోద్వేగాలు ఉంటాయి. కీర్తీశ్వరన్‌గారు చెప్పిన కథకంటే 20 శాతం ఎక్కువగానే సినిమా తీశారు. మా మూవీ అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ చెప్పిన విశేషాలు.
→ ‘డ్యూడ్’ యూత్‌తో పాటు ఫ్యామిలీ కూడా చూసే కంటెంట్. చాలా కొత్తగా ఉంటుంది. చెప్పాలంటే ‘సఖి’ లాంటి ఫ్యామిలీ మూవీ. ప్రదీప్‌గారి ‘లవ్ టుడే, డ్రాగన్’ సినిమాలు తెలుగులో దాదాపు రూ. 12 కోట్లు కలెక్షన్స్ తెచ్చుకున్నాయి. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉన్నాయి కాబట్టి ‘డ్యూడ్’ కచ్చితంగా రూ. 15 కోట్లు వసూలు చేస్తుందని నమ్ముతున్నాం.
→ ‘డ్యూడ్’ని తమిళంలో ఏజీఎస్ సంస్థ ద్వారా తమిళంలో మేమే విడుదల చేస్తున్నాం. తమిళ్‌తో సమానంగా తెలుగులోనూ మా సినిమా ఆడుతుందనే నమ్మకం ఉంది.
→ మేము హిందీలో తీసిన ‘జాట్’ మాకు మంచి వెంచర్. ‘జాట్ 2’ కూడా ఉంటుంది. ప్రభాస్‌గారితో, ఎన్టీఆర్‌గారితో మేం నిర్మిస్తున్న సినిమాలు 2026లోనే వస్తాయి. రామ్‌తో తీస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ బాగుంటుంది. ‘పెద్ది’ చిత్రం 2026 మార్చ్ 27న కచ్చితంగా విడుదలవుతుంది. ఆ తర్వాత సుకుమార్‌గారితో సినిమా ఉంటుంది.