breaking news
yalamanchili ravishankar
-
టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో మూడోరోజు ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: సినీప్రముఖుల ఇళ్లలో వరుసగా మూడోరోజు ఐటీ సోదాలు (Income Tax department Raids) కొనసాగుతున్నాయి. నిర్మాతలతో పాటు నిర్మాణ సంస్థలకు ఫైనాన్స్ చేసిన వారి నివాసాలు, ఆఫీసుల్లోనూ అధికారులు తనిఖీ చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్, నిర్మాత నెక్కింటి శ్రీదర్, దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, కార్యాలయల్లో సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.టాలీవుడ్‌పై టార్గెట్తెలుగు సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ మంగళవారం సోదాలు మొదలుపెట్టింది. దాదాపు 55 బృందాలతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లో, ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా ఆఫీస్‌లోనూ సోదాలు చేశారు. పుష్ప 2 సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టిన నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. వసూళ్లకు తగ్గట్లుగా ఆదాయపన్ను చెల్లించలేదని గుర్తించారు.బుధవారం నాడు సుకుమార్ ఇంటికీ ఐటీ అధికారులు వెళ్లారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన సుకుమార్‌ను నేరుగా ఇంటికి తీసుకెళ్లిన అధికారులు ఆయన బ్యాంకు లావాదేవీలు, లాకర్ల గురించి ఆరా తీశారు. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ ఇంట్లోనూ సోదాలు చేశారు. దిల్ రాజు కూతురు హన్సిత, సోదరుడు నర్సింహ ఇంట్లోనూ తనిఖీలు చేశారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ వారం రోజుల్లో రూ. 203 కోట్లు వసూళ్లు చేసిందని, కానీ లాభాలకు తగ్గట్లు పన్నులు చెల్లించలేదని ఐటీ శాఖ గుర్తించింది.మరోవైపు ఈ వ్యవహారంపై దిల్‌రాజు బుధవారం స్పందిస్తూ.. ఐటీ రైడ్స్ తన ఒక్కడిపైనే0 జరగట్లేదని.. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు తెలిపారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు అధికారులకు సహకరిస్తున్నారని చెప్పారు. -
‘ఇన్ని ఛానళ్లు రావడానికి పొట్లూరి కృషే కారణం’
సాక్షి, విజయవాడ : కేబుల్ వ్యవస్థకు అంకురార్పణ చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించిన మహనీయులు పొట్లూరి రామకృష్ణ అని మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి అన్నారు. విజయవాడ సిటీ ఛానల్ కార్యాలయంలో జరిగిన సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ 21వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యలమంచిలి రవి మాట్లాడుతూ.. నేడు ఇన్ని ఛానళ్లు రావడానికి పొట్లూరి రామకృష్ణ కృషే కారణమని, దేశంలో ఎన్నో నెట్‌వర్క్‌లు ఉన్నా ఇప్పటికీ సిటీ కేబుల్ ప్రథమ స్థానంలో ఉందని గుర్తుచేశారు. కేబుల్ వ్యవస్థ ఉన్నన్నాళ్లు రామకృష్ణ జీవించే ఉంటారని పేర్కొన్నారు. సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు మాట్లాడుతూ.. స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ బాటలోనే మేమంతా నడుస్తున్నామని, ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే సిటీ కేబుల్ వ్యవస్థ నెంబర్‌వన్‌లో ఉందని తెలిపారు. సిటీ కేబుల్ వ్యవస్థ అభివృద్ధికి ఆపరేటర్లు, ప్రేక్షకులే కారణమని స్పష్టం చేశారు. తమ సంస్థ ద్వారా అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా యలమంచిలి రవి, పొట్లూరి సాయిబాబు రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.ఓ లు, ఆపరేటర్లు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. -
న్యూజెర్సీలో 'శ్రీమంతుడు' వేడుకలు
విజయవాడ: 'శ్రీమంతుడు' చిత్రం విజయోత్సవ వేడుకలను అక్టోబర్ 24న అమెరికాలోని న్యూజెర్సీలో జరుపనున్నట్లు ఆ చిత్ర నిర్మాత యలమంచిలి రవిశంకర్ తెలిపారు. ఈ వేడుకల్లో చిత్ర హీరోహీరోయిన్లతో పాటు నటీనటులంతా పాల్గొంటారని ఆయన తెలియజేశారు. విజయవాడలోని తన స్నేహితుల ఇంటికి వచ్చిన సమయంలో రవిశంకర్ మీడియాతో ముచ్చటించారు. మహేశ్‌బాబు అభిమానులు న్యూజెర్సీలో ఎక్కువగా ఉన్నారని అందుకే ఈ వేడుకలను అక్కడ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో సుమారు 3 వేల మంది తెలుగువారు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.