ఓటీటీలో డ్యూడ్‌.. రెండు రోజుల్లోనే నంబర్‌వన్‌గా! | Pradeep Ranganathan Dude movie trending in first place in OTT | Sakshi
Sakshi News home page

Dude Movie: ఓటీటీలో నంబర్‌వన్‌గా ట్రెండింగ్.. ఎక్కడ చూడాలంటే!

Nov 16 2025 1:01 PM | Updated on Nov 16 2025 1:10 PM

Pradeep Ranganathan Dude movie trending in first place in OTT

లవ్ టుడే, డ్రాగన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్. ఇటీవలే 'డ్యూడ్' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీపావళి సందర్భంగా గత  థియేటర్లలోకి వచ్చిన డ్యూడ్‌ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.

ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈనెల 14 నుంచే తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ బాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఓటీటీకి వచ్చిన రెండు రోజుల్లోనే నంబర్‌వన్ ‍స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది. కాగా.. మమిత బైజు హీరోయిన్‌గా కనిపించగా.. శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement