ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ది రాజాసాబ్. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి. తొలిసారి వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్‌లో అంచనాలు పెరిగాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ మూవీ రిలీజ్‌కు కేవలం వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు మేకర్స్. ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన మారుతి ఫుల్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఈ మూవీ కోసం మూడేళ్లు కష్టపడ్డామని స్టేజీపైనే భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించాడు డైరెక్టర్ మారుతి.
అయితే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనడంతో.. తాజాగా ఈ మూవీ స్టార్స్ రెమ్యునరేషన్‌పై కూడా చర్చ మొదలైంది. ఈ సినిమాకు ప్రభాస్‌తో పాటు సంజయ్ దత్, హీరోయిన్స్ పారితోషికాలపై నెట్టింట టాక్ నడుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రభాస్ తన రెగ్యులర్ రెమ్యునరేషన్ కంటే తక్కువగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి రెబల్ స్టార్ రూ.100 కోట్లు తీసుకున్నారని టాక్.
ఎవరికి ఎంతంటే?
మరోవైపు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ది రాజాసాబ్ కోసం భారీగానే పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు తీసుకున్నారని టాక్. హీరోయిన్ల విషయానికొస్తే కోలీవుడ్ భామ మాళవిక మోహనన్ రూ.2 కోట్లు, నిధి అగర్వాల్ రూ.1.5 కోట్లు, రిద్ధి కుమార్ రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. వీరితో పాటు బ్రహ్మనందం రూ.80 లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా.. ఈ చిత్రానికి డైరెక్టర్ మారుతి సైతం భారీగానే తీసుకున్నట్లు టాక్. ఈ మూవీకి దాదాపు రూ.18 కోట్ల పారితోషికం అందుకోనున్నారని తెలుస్తోంది. ఈ మూవీని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.


