చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడే సందడి. ఈ వారంలో సినీ ప్రియులను అలరించేందుకు తెలుగు చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా రిలీజవుతున్నాయి. టాలీవుడ్ నుంచి సంతాన ప్రాప్తిరస్తు, జిగ్రిస్ వస్తుండగా.. దుల్కర్ సల్మాన్, రానా నటించిన డబ్బింగ్ మూవీ కాంత కూడా థియేటర్లలో సందడి చేయనుంది. వీటిలో కాంత, సంతాన ప్రాప్తిరస్తు సినిమాలపైనే ఓ రేంజ్‌లో హైప్ ఉంది.
ఇక బాక్సాఫీస్ వద్ద సంగతి అటుంచితే ఓటీటీ ప్రియులకు ఈ వీకెండ్ పండగే అని చెప్పాలి. దీపావళి రిలీజైన చిత్రాలన్నీ ఓకేసారి మూకుమ్మడిగా ఓటీటీకి వచ్చేస్తున్నాయి. కిరణ్ అబ్బవరం కె- ర్యాంప్, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా, ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమాలు రెండు రోజుల వ్యవధిలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో అక్షయ్ కుమార్ జాలీ ఎల్‌ఎల్‌బీ-3 కూడా ఓటీటీకి వచ్చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మరి.. మీకు నచ్చిన సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్..
తెలుసు కదా(తెలుగు సినిమా)- నవంబర్ 14
డ్యూడ్ (తెలుగు సినిమా) - నవంబరు 14
ఇన్ యువర్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 14
జాక్ పాల్ vs ట్యాంక్ డేవిస్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 14
నోవెల్లే వాగ్ (ఫ్రెంచ్ మూవీ) - నవంబరు 14
లెఫ్టర్- ది స్టోరీ ఆఫ్ ది ఆర్డినరీస్(హాలీవుడ్ మూవీ)- నవంబరు 14
ది క్రిస్టల్ కుక్కు(స్పానిష్ థ్రిల్లర్ మూవీ)- నవంబరు 14
జియో హాట్‌స్టార్
జాలీ ఎల్ఎల్‌బీ 3 (హిందీ మూవీ) - నవంబరు 14
అవిహితం (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 14
జురాసిక్ వరల్డ్ రీబర్త్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 14
అమెజాన్ ప్రైమ్
నిశాంచి(హిందీ సినిమా) - నవంబర్ 14
మాలిస్ సీజన్-1(హాలీవుడ్ సిరీస్)- నవంబర్ 14
జీ5
దశావతార్ (మరాఠీ సినిమా) - నవంబరు 14
ఇన్‌స్పెక్షన్ బంగ్లా (మలయాళ సిరీస్) - నవంబరు 14
ఆహా
కె ర్యాంప్ (తెలుగు సినిమా) - నవంబరు 15
సన్ నెక్ట్స్
మారుతం(తమిళ సినిమా)- నవంబర్ 14
దండకారణ్యం(తమిళ సినిమా)- నవంబర్ 14
ఆపిల్ టీవీ ప్లస్
కమ్ సీ మీ ఇన్ ద గుడ్ లైట్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 14
మనోరమ మ్యాక్స్
కప్లింగ్ (మలయాళ సిరీస్) - నవంబరు 14
సింప్లీ సౌత్
పొయ్యమొళి (మలయాళ సినిమా) - నవంబరు 14
యోలో (తమిళ మూవీ) - నవంబరు 14


