దీపావళి సందర్భంగా విడుదలైన చిత్రాల్లో ‘డ్యూడ్’ (Dude) భారీ హిట్ అందుకుంది. ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan), మమిత బైజు జంటగా నటించారు. శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు కూడా వచ్చేసింది. అయితే, తాజాగా డ్యూడ్ నుంచి బూమ్ బూమ్ అనే వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాట ఆడియో వర్షన్‌లో వంద మిలియన్లు రీచ్ అయిందని చిత్ర యూనిట్ ప్రకటిస్తూ ఒకపోస్టర్‌ను రిలీజ్ చేసింది. కేవలం ఆడియో మాత్రమే సూపర్ హిట్ కావడంతో అభిమానుల కోసం వీడియో వర్షన్‌ను తాజాగా విడుదల చేశారు.


