
లవ్ టుడే, డ్రాగన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ హిట్స్ కొట్టిన తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్.. ఇప్పుడు మరో మూవీతో వచ్చేస్తున్నాడు. అదే 'డ్యూడ్'. తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజు హీరోయిన్ కాగా కీర్తిశ్వరన్ దర్శకుడు. దీపావళి కానుకగా ఈనెల 17న మూవీ థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: నాగార్జునతో టబు.. మళ్లీ ఇన్నేళ్లకు జంటగా!)
ప్రదీప్ స్వతహాగా దర్శకుడు. కానీ హీరోగా లవ్ టుడే, డ్రాగన్ లాంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ చేశాడు. 'డ్యూడ్' కూడా అదే జానర్ అని ట్రైలర్ చూస్తుంటే అర్థమైంది. అయితే ఈసారి కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా చూపించబోతున్నారనే విషయాన్ని ట్రైలర్‌తో చెప్పకనే చెప్పారు. ప్రదీప్-మమిత ప్రేమించుకుంటారు. కానీ పెళ్లి అనేసరికి మమిత నో చెప్పేస్తుంది. తర్వాత ప్రదీప్.. నేహాశెట్టితో ప్రేమలో పడతాడు. తర్వాత ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.
ట్రైలర్లో కథని చెప్పి చెప్పనట్లు చూపించారు. సాయి అభ్యంకర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. 'డ్యూడ్'తో పాటు దీపావళికి తెలుగులో మిత్రమండలి, తెలుసు కదా, కె ర్యాంప్ మూవీస్ వస్తున్నాయి. వీటితో పోటీలో మరి 'డ్యూడ్' ఏం చేస్తాడో చూడాలి?
(ఇదీ చదవండి: సర్‌ప్రైజ్.. స్టార్ హీరోని మళ్లీ బతికించారు)