
నాగార్జున పేరు చెప్పగానే మన్మథుడు అనే ట్యాగ్ లైన్ గుర్తొస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం 66 ఏళ్లు. అయినా సరే చాలామంది కుర్రహీరోలు అసూయ పడేలా ఫిజిక్ మెంటైన్ చేస్తుంటారు. అప్పట్లో పెళ్లికి ముందు నాగ్ తో పలువురు హీరోయిన్ల విషయంలో రూమర్స్ కూడా వచ్చాయి. అలాంటి బ్యూటీల్లో టబు ఒకరు. 'నిన్నే పెళ్లాడతా'లో అదిరిపోయే కెమిస్ట్రీ పండించిన ఈ జంట.. తర్వాత ఎందుకో కలిసి నటించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు జోడీ సెట్ అయినట్లు కనిపిస్తుంది.
1995లో 'సిసింద్రీ' సినిమా కోసం తొలిసారి నాగార్జున, టబుతో కలిసి పనిచేశారు. ఇక తర్వాత ఏడాది అంటే 96లో వచ్చిన 'నిన్నే పెళ్లాడతా' మూవీ.. వీళ్ల జోడికి ఎక్కడలేని క్రేజ్ తీసుకొచ్చింది. దీంతో 98లో 'ఆవిడ మా ఆవిడే' అని ఓ చిత్రం చేశారు. కాకపోతే పెద్దగా వర్కౌట్ కాలేదు. దానికి తోడు వీళ్లిద్దరి మధ్య రిలేషన్ ఉందనే రూమర్స్ కూడా వినిపించాయి. కానీ తర్వాత కాలంలో వీళ్లు ఎవరికి వాళ్లు కెరీర్ పరంగా బిజీ అయిపోయారు. మళ్లీ ఇప్పుడు ఓ మూవీ కోసం జంటగా నటించనున్నారనే టాక్ వినిపిస్తుంది.
(ఇదీ చదవండి: Bigg Boss 9: ప్రపోజ్ చేసిన కల్యాణ్.. కానీ చివరకు వరస్ట్ ఆటగాడిగా)
ఈ ఏడాది 'కుబేర', 'కూలీ' చిత్రాల్లో డిఫరెంట్ పాత్రలు చేసిన నాగార్జున.. ఇప్పుడు హీరోగా తన 100వ చిత్రం చేస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తిక్ ఈ మూవీ తీస్తున్నాడు. ఈ సోమవారం హైదరాబాద్‌లో సింపుల్‌గా లాంచ్ కూడా జరిగింది. 'లాటరీ కింగ్' అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్లు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడీ ఈ చిత్రంలోనే నాగ్ సరసన టబు నటిస్తుందని, అంతా ఫైనల్ కూడా అయిపోయిందని మాట్లాడుకుంటున్నారు.
టబు విషయానికొస్తే.. అప్పట్లో హీరోయిన్‌గా వరస సినిమాలు చేసింది. గత కొన్నాళ్ల నుంచి మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు భాషల్లో నటిస్తోంది. ఈ మధ్య కాలంలో తెలుగులో 'అల వైకుంఠపురములో' చేసింది. పూరీ-విజయ్ సేతుపతి ప్రాజెక్టులోనూ నటిస్తోంది. ఇప్పుడు నాగ్‌తో కాంబో ఫిక్స్ అయితే మాత్రం హైప్ రావడం గ్యారంటీనే.
(ఇదీ చదవండి: సర్‌ప్రైజ్.. స్టార్ హీరోని మళ్లీ బతికించారు)
