
బిగ్‌బాస్ షో ప్రేమ, రిలేషన్ లాంటి వాటికి పెట్టింది పేరు. ప్రతి సీజన్‌లోనూ ఏదో ఓ జంట తెగ కెమిస్ట్రీ పండించేస్తూ ఉంటుంది. ఈసారి కూడా అలాంటి జంటలు కనిపిస్తున్నాయి. అయితే కొన్నిరోజుల ముందు వరకు ట్రయాంగిల్ ప్రేమకథ కనిపించింది. కానీ ఇప్పుడు రెండు జంటల మధ్య సరదా ముచ్చట్లు కనిపిస్తున్నాయి. బుధవారం ఎపిసోడ్‌లో జంటల్లో ఒకటైన తనూజ-కల్యాణ్ 'ప్రపోజల్' కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మరి ఈ విషయంపై దృష్టి పెట్టడం వల్లో ఏమో గానీ చివరకొచ్చేసరికి కల్యాణ్.. వరస్ట్ ప్లేయర్‌గా మిగిలాడు. ఇంతకీ 31వ రోజు ఏమేం జరిగింది?
హౌస్‌మేట్స్ ఇమ్యూనిటీ సాధించేందుకు బిగ్‌బాస్.. మంగళవారం ఎపిసోడ్‌లో పట్టు వదలకు, బెలూన్ టాస్క్ పోటీలు పెట్టారు. బుధవారం నేరుగా గేమ్స్ కాకుండా కాసింత డ్రామా నడిచింది. ఉదయం లేచిన తర్వాత బయట అలా తిరుగుతూ ఇమ్మూ, తనుజ కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. నేను నీ బ్రదర్‌గా ఉండాలనుకోవట్లేదు జెస్సీ అంటూ తనూజతో ఇమ్మూ... సినిమా డైలాగ్స్ కొట్టాడు. దీంతో నీ వయసెంత అని తనూజ అడిగింది. నీ కన్నా రెండు సంవత్సరాలు పెద్దే అని ఇమ్మూ చెప్పాడు. ఫర్లేదు ఎవరైనా అడిగితే అన్నయ్య లాంటి వాడివని చెప్పేస్తానని తనూజ పంచ్ వేసింది. చెప్పాల్సినోళ్లకి చెప్పెయ్ తమ్ముడని, నాకెందుకు అని ఇమ్మూ.. కల్యాణ్ వైపు చూసి ఫన్ చేసేశాడు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ హౌస్‌కి తాళం.. గంటల్లోనే మూసేసిన అధికారులు)
కాసేపటి తర్వాత తనూజతో డిస్కషన్ పెట్టిన కల్యాణ్.. ఏదైనా ఛాన్స్ ఉంది, నాలాంటోడు అయితే నీకు ఓకేనా? అని నేరుగా ప్రపోజల్ పెట్టేశాడు. దీంతో తనూజ.. అందుకే నిన్ను పిల్లాడు అనేది అని నవ్వుకుంది. ఏ పరిస్థితుల్లోనైనా కూల్, కామ్‌గా డీల్ చేసే పర్సన్.. ఒకరు వంద మాటలు మాట్లాడినా ఒకే మాటలో దాన్ని ఫసక్ చేసి, ఆ టాపిక్‌ని తెగ్గొట్టే సత్తా, అన్నింటినీ మించి నా మైండ్ సెట్‌కి మ్యాచ్ అయ్యే వ్యక్తి అంటే నాకు ఇష్టం అని తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో తనూజ చెప్పింది. దీంతో కల్యాణ్ సైలెంట్ అయిపోయాడు. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న ఇమ్మూ-రీతూ చౌదరి కౌంటర్స్ వేసి నవ్వుకున్నారు.

మళ్లీ గేమ్స్ మొదలుపెట్టిన బిగ్‌బాస్.. 'మ్యాచ్ ఇట్ విన్ ఇట్' అనే టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా జట్టు సభ్యుల్లోని ఒకరు.. యాక్టివిటీ ఏరియాలోని మ్యూజియంకు వెళ్లి అక్కడున్న వస్తువుల్ని గమనించి.. మళ్లీ లివింగ్ ఏరియాకు వచ్చి బోర్డుపై దాని బొమ్మ గీస్తారు. జట్టులోని మరో సభ్యుడు.. ఆ వస్తువు లేదా బొమ్మ ఏంటని సరిగా అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ పోటీలోని తొలి రౌండ్‌లో దివ్య-భరణి గెలిచారు. తర్వాత వరస రౌండ్లలో ఫ్లోరా-సంజన, శ్రీజ-సుమన్, రీతూ-పవన్ గెలిచారు. తనూజ-కల్యాణ్ జోడీ మాత్రం ఓడిపోయారు. తనూజ బొమ్మలు బాగానే వేసినప్పటికీ కల్యాణ్ వాటిని గుర్తుపట్టలేకపోయాడు.
దీని తర్వాత 'హోల్డ్ ఇట్ లాంగ్' అనే మరో టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా కేటాయించిన ఫ్లాట్‌ఫామ్ రెండు వైపుల నిలబడి, తాళ్లతో ఉన్న హ్యాండిల్స్‌తో ఫ్లాట్‌ఫామ్‌ని గాలిలో ఉంచి పట్టుకోవాలి. టాస్క్ ముగిసేవరకు ఏ జట్టు.. ఫ్లాట్‌ఫామ్‌ని గాలిలో ఉంచగలుగుతారో వాళ్లు గెలిచినట్లు. అయితే ఈ గేమ్‌లోనూ కల్యాణ్-తనూజ ఓడిపోయారు. లెక్క ప్రకారం పవన్-రీతూతో పాటు వీళ్లు చాలాసేపు ఉన్నారు. కానీ కల్యాణ్.. మాట్లాడి తనూజని డిస్టర్బ్ చేశాడు. దీంతో ఓడిపోయారు. తర్వాత తనూజ.. కల్యాణ్‌పై గట్టిగా అరిచేసింది. కళ్యాణ్ ఫోకస్ ఉండాల్సింది దానిపైన కద కళ్యాణ్.. నా ముఖం మీద కాదు నువ్వు ఫోకస్ చేయాల్సింది అని గట్టిగానే ఇచ్చేసింది. లీడర్ బోర్డ్‌లో పవన్-రీతూ (190 పాయింట్స్), సంజన-ఫ్లోరా (180), దివ్య-భరణి (180), తనూజ-కల్యాణ్ (110), శ్రీజ-సుమన్ శెట్టి(90) వరస స్థానాల్లో నిలిచారు. ఇక డేంజర్ జోన్‌లో కల్యాణ్, శ్రీజ, సుమన్ నిలిచారు. అందరూ కలిసి కల్యాణ్.. వరస్ట్ ప్లేయర్ అని డిసైడ్ చేశారు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది.
(ఇదీ చదవండి: సర్‌ప్రైజ్.. స్టార్ హీరోని మళ్లీ బతికించారు)