
తెలుగు, తమిళం, హిందీలో ప్రస్తుతం బిగ్‌బాస్ షో ప్రసారమవుతోంది. కన్నడ సీజన్ మాత్రం మొదలైన పదిరోజులకే క్లోజ్ అయిపోయింది. ఏకంగా ప్రభుత్వ అధికారులు వచ్చి హౌస్‌కి మంగళవారం తాళం వేశారు. ఈ క్రమంలోనే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇంతకీ అసలేం జరిగింది? ఏంటి విషయం?
కన్నడ హీరో సుదీప్.. కన్నడ బిగ్‌బాస్ 12వ సీజన్‌కి హోస్టింగ్ చేస్తున్నాడు. గత నెల అంటే సెప్టెంబరు 28న ఆదివారంతో షో మొదలైంది. బెంగళూరుకి దక్షిణాన ఉన్న జాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్‌లో హౌస్ సెట్ వేశారు. అయితే హౌస్ నుంచి వచ్చే వ్యర్థాలని బయటకు వదిలేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే పర్యావరణ నియంత్రణ మండలి.. షో నిర్వహకులకు నోటీసులు జారీ చేసింది. వెంటనే బిగ్‌బాస్ ఆపేయాలని కర్ణాటక కాలుష్య బోర్డ్ కూడా ఆదేశించింది. విద్యుత్ సరఫరా కూడా నిలిపేయాలని సంబంధిత శాఖకు సూచించింది.
(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్స్ బెల్లీ డ్యాన్స్.. వీడియో సాంగ్ రిలీజ్)
ఇక మంగళవారం.. ప్రాంతీయ తహసీల్దార్ నేతృత్వంలో అధికారులు.. బిగ్‌బాస్ హౌస్ దగ్గరకు వెళ్లారు. తర్వాత పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. గంటలో అందరూ హౌస్‌ని ఖాళీ చేయాలని హెచ్చరించారు. అయినా సరే లోపలి నుంచి ఎవరూ బయటకు రాలేదు. దీంతో అధికారులు.. హౌస్‌కి తాళం వేశారు. ఇక చేసేదేం లేక రాత్రి 8 గంటల తర్వాత కంటెస్టెంట్స్ అందరినీ నిర్వహకులు.. ఓ థియేటర్‌కి తరలించారు.
అయితే షో మొదలు కాకముందే పోలీసులు, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ నిర్వహకులకు అవేం పట్టినట్లు లేవు. ఎలాంటి పర్మిషన్స్ లేకుండానే షో ప్రారంభించారు. ఇప్పుడు మొదలైన 10 రోజుల్లో క్లోజ్ అయిపోయింది. మరి ఈ సీజన్ మళ్లీ మొదలవుతుందా లేదంటే ఇక్కడితే ఆపేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయమై కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ.. చట్టం ముందు అందరూ సమానమేనని, రెండుసార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని అందుకే ఇలా చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.
(ఇదీ చదవండి: Bigg Boss 9: రీతూ దొంగ తెలివితేటలు.. మిగతా వాళ్లందరూ బలి)
VIDEO | Bengaluru: The Bengaluru South district authorities on Tuesday sealed the studio premises hosting the Kannada reality show 'Bigg Boss' in Bidadi following the Karnataka State Pollution Control Board (KSPCB) order. The board had cited serious violations of environmental… pic.twitter.com/E1Ejv8kVo7
— Press Trust of India (@PTI_News) October 8, 2025