
బిగ్బాస్ షోలో ప్రస్తుతం ఐదోవారం నడుస్తోంది. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని అంటున్నారు. ఇప్పుడు ఆ విషయమై క్లారిటీ వచ్చేసింది. మరోవైపు డేంజర్ జోన్ వల్ల రీతూ చావు తెలివితేటలు చూపించింది. దీంతో బిగ్‌బాస్ కోపం వచ్చింది. రీతూ చేసిన పనివల్ల మిగతా వాళ్లందరూ బలి అయిపోయారు. ఇంతకీ హౌస్‌లో 30వ రోజు ఏమేం జరిగింది? ఈసారి నామినేషన్లలో ఉన్నది ఎవరు?
మంగళవారం ఎపిసోడ్‌లో వైల్డ్ కార్ట్ ఎంట్రీల గురించి చెప్పిన బిగ్‌బాస్.. కెప్టెన్ రాము, ఇమ్మాన్యుయేల్ తప్పితే మిగిలిన వాళ్లంతా డేంజర్‌లో ఉన్నారు. అయితే ఈ వారం డేంజర్‌లో ఉన్నవాళ్లకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే వచ్చే ఫైర్ స్ట్రామ్ డేంజర్‌లో ఉన్నవాళ్లని కుదిపేస్తుంది. అదేంటంటే వైల్డ్ కార్డ్స్ ఈ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ వారం ముగిసేలోపు ఎవరైతే డేంజర్ జోన్‌లో ఉంటారో వాళ్లు ఎవిక్షన్ ప్రక్రియ తీసుకొచ్చే ఎప్పుడూ చూడని తీవ్రమైన ఫైర్ స్ట్రామ్‌ని ఎదుర్కోక తప్పదని చెప్పకనే చెప్పాడు. అంటే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని హింట్ ఇచ్చేశాడు.
ఇకనుంచి హౌసులో ఓనర్స్, టెనెంట్స్ ఉండరని చెప్పిన బిగ్‌బాస్.. ఇప్పటినుంచి కొన్ని ఛాలెంజెస్ ఇస్తాను. వాటిలో మంచి ప్రదర్శన చేసి ఎవరైతే పాయింట్స్ తెచ్చుకుంటారో వాళ్లు సేవ్ అవుతారు. అయితే ఈ పోటీల కోసం జంటలుగా విడిపోవాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో పవన్-రీతూ, సంజన-ఫ్లోరా, భరణి-దివ్య, శ్రీజ-సుమన్, కల్యాణ్-తనూజ జట్టుకట్టారు. తొలుత 'పట్టువదలకు' అనే టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా ఇసుకని తీసుకొచ్చి నచ్చని జట్టు పట్టుకున్న ఓ బాక్స్‌లో వేయాల్సి ఉంటుంది. మరోవైపు ఇసుక నిండితే బాక్స్ కిందకు తగులుతుంది. అలా తగలకుండా ఎవరైతే ఎక్కువసేపు పట్టుకుంటారో వాళ్లు గెలిచినట్లు అని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ గేమ్‌లో పవన్-రీతూ విజయం సాధించారు.

అయితే ఇసుక టాస్క్‌లో భరణికి జంటగా ఉన్న దివ్య.. ఇసుకని తీసుకొచ్చి తనూజ టీమ్ బకెట్‌లో వేసింది. గేమ్ అయిపోయిన తర్వాత తనూజ హర్ట్ అయిపోయింది. దీంతో భరణి వచ్చి ఆమెని సముదాయించేందుకు తెగ ప్రయత్నించాడు. కానీ వినలేదు. దీంతో ఆమె చెబుతున్నంతసేపు భరణి సైలెంట్‌గానే ఉండిపోయాడు. రెండో పోటీగా బెలూన్ టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా జంటలోని ఓ కంటెస్టెంట్ ఓ బాక్స్‌లో సూదులతో ఉన్న మాస్క్ పెట్టుకుని తల పెట్టాల్స ఉంటుంది. మరో కంటెస్టెంట్ బెలూన్‌ని లోపల వేయాలి. బాక్స్ లోపల ఉన్న సభ్యులు ఆ బెలూన్స్ తమ మాస్క్‌కి ఉన్న నీడిల్స్‌కి తగిలి పగలకుండా ఉండేలా పైకి ఊదుతూ గాల్లో ఉంచాలి అదే సమయంలో ఆ బెలూన్స్ బాక్స్ నుంచి బయటికి వెళ్లకుండా కూడా చూసుకోవాలని చెప్పాడు.
అయితే ఈ పోటీలో రీతూ చావు తెలివితేటలు చూపించింది. పవన్ వెనక బెలూన్ ఉంచేసింది. ఈమెని శ్రీజ, తనూజ టీమ్స్ కూడా అదే ఫాలో అయిపోయారు. దీంతో బిగ్‌బాస్‌కి కోపం వచ్చింది. స్ట్రాటజీకి ఫౌల్ గేమ్‌కి మధ్య తేడా బిగ్‌బాస్‌కి చాలా బాగా తెలుసు. మీరు చదివిన స్కూల్‌కి చదువుతున్న స్కూల్‌కి ప్రిన్సిపల్ నేను. కానీ అత్యంత పేలవమైన ఆట ఇది. ఆట స్ఫూర్తికే విరుద్ధం అని ఏకిపారేశాడు. ఈ క్రమంలో ఈ గేమ్‌లో ఆడిన సంజన-ఫ్లోరాకి తప్పితే మిగిలిన వాళ్లందరూ ఉన్న పాయింట్లలో సగం కట్ చేసి పడేశాడు. దీంతో గేమ్ ఆడినా సరే పాయింట్ల్ రాలేదే అని సంజన ఏడ్చేసింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పవన్, దివ్య, రీతూ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నారు.